వైసీపీ పార్టీ మళ్ళీ గెలుస్తుంది, జగనన్న మళ్ళీ సీఎం అవుతాడంటా ఎన్నికల రిజల్ట్ వరకు కాన్ఫిడెన్స్ చూపిస్తూ వచ్చిన రోజాకి నగరి ప్రజలు మాములుగా షాకివ్వలేదు. అసలు రోజాకి నగరి టికెట్ విషయంలోనే గందరగోళం నడిచింది. రోజా ని నగరిలో సొంత పార్టీ నేతలే చుక్కలు చూపించారు. ఎన్నికల్లో నగరి ప్రజలు రోజని తిరస్కరించారు.
ఓడిపోయాక తనని ట్రోల్ చేసే వాళ్ళని బ్రతిమాలుకుంది. తానొక మహిళనంటూ అప్పుడు గుర్తు చేసింది. అంతకుముందు ప్రతిపక్షాలపై అడ్డమైన కారు కూతలు కూసినప్పడు గుర్తుకు రాని పరువు ఓడిపోయాక తనని ట్రోల్ చేస్తుంటే కానీ గుర్తు రాలేదు. ఇక తాజాగా ఓటమి అనేది చెడు చెయ్యడం వల్ల కాదు.. మంచి చేసి ఓడిపోయామంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
ఈరోజు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో అవకతవకలు జరిగాయంటూ, కిట్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని సీఐడీకి ఫిర్యాదు అందింది. సీఐడీ దీనిపై కేసు నమోదు చేస్తే గనక అప్పటి క్రీడాశాఖ మంత్రిగా రోజా, శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు ఇబ్బందులు తప్పవని ఈ రోజు మీడియాలో హైలెట్ అయ్యింది.
అదే సమయంలో రోజా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది.
చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!🔥🔥అంటూ ట్వీట్ చేసింది. మరి రోజా ప్రజలకి మంచి చేసి ఓడిపోయిందట. చెడు చెయ్యలేదు, చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా అంటూ రోజా కొత్త రాగం మొదలెట్టింది. మరి ఆ మంచేదో కూడా చెప్పు రోజా అంటూ నగరి ప్రజలే కామెంట్ చెయ్యడం గమనార్హం.