Advertisement

నీ దారే నీ కథ మూవీ రివ్యూ


నీ దారే నీ కథ మూవీ రివ్యూ

Advertisement

ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీ

నటీనటులు :

ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.

టెక్నికల్ టీం :

బ్యానర్ : జె వి ప్రొడక్షన్స్

నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ

రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ

సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి

సినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావు

కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోట

ఎడిటర్ : విపిన్ సామ్యూల్

దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ

పి ఆర్ ఓ : మధు VR

కంటెంట్ బావుంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆదరించడానికి ఆడియన్స్ రెడీగా ఉంటారు. గత నాలుగు నెలలుగా భారీ బడ్జెట్ సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద సందడి చేయలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండడంతో.. ఈ గ్యాప్ ని చిన్న సినిమాలు ఫిల్ చేసాయి. ప్రతి వారం చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి.. అందులో కొన్ని ప్రేక్షకులని ఆకట్టుకోగా.. మరికొన్ని సైలెంట్ గా ఓటీటీల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇక ఈ వారం కూడా బాక్సాఫీసు దగ్గర చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల హడావిడి కనిపించగా అందులో.. వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో తేజేష్ వీర నిర్మాతగా వచ్చిన సినిమా నీ దారే నీ కథ ఒకటి. చిన్న సినిమానే అయినా పోస్టర్స్, ట్రైలర్ తో ఇందులో విషయముంది అనిపించేలా సినిమాని ప్రమోట్ చేసారు. మరి నీ దారే నీ కథ అసలు విషయమేమిటో సమీక్షలో చూసేద్దాం. 

కథ విషయానికొస్తే : అర్జున్ (ప్రియతమ్ మంతిని) తన ఫ్రెండ్స్ తో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటారు. మంచి మ్యూజిషియన్ గా పేరు తెచ్చుకుని మ్యూజిక్ ఆర్కెస్ట్రా ని రన్ చేస్తూ టీమ్ గా చేయాలనేది అతని కోరిక. ఈ విషయంలో అర్జున్ కి తన తండ్రి (సురేష్) నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అర్జున్ అనుకున్న సాధించే ప్రయత్నంలో ఉండగా ఆర్కెస్ట్రా టీమ్ లో ఉన్న ఒక  ఫ్రెండ్ తప్పుకున్నప్పుడు అర్జున్ కి సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. అర్జున్ తండ్రి అర్జున్ కలకన్నదానిని సాధించి ఒక మంచి మ్యూజిషియన్ గా చూడాలనుకుంటాడు. కానీ ఆయన మధ్యలో మరణిస్తాడు. మరి అర్జున్ తండ్రి కోరికని నెరవేర్చాడా లేదా? తను అనుకున్నది సాధించి మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసి మ్యూజిషియన్ అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

నటీనటుల ఎఫర్ట్స్ :  ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ సురేష్ అనే చెప్పాలి. కొడుకు డ్రీమ్ ని నమ్మి సపోర్ట్ చేసే తండ్రి పాత్రలో ఆయన నటన బాగుంది. ప్రియతమ్ కొత్తవాడైన బాగా నటించాడు. విజయ్ విక్రాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నవ్విస్తూ ఎమోషన్ పండిస్తూ మంచి నటనని కనబరిచాడు. అజయ్, పోసాని కృష్ణమురళి గారు తమ పాత్రల పరిధి మేరకు నటించి సినిమాకి సపోర్ట్ గా నిలిచారు. అంజనా బాలాజీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ బాగా నటించింది.

టెక్నికల్ టీం : వంశి జొన్నలగడ్డ ఎంచుకున్న కథ ఈ కాలంలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకొని వచ్చాడు. టెక్నికల్ వాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టీం వర్క్ తో పని చేశారు. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్టుగా బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూస్ చేస్తూ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సింగ్ సౌండ్ అయినా కూడా ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందరూ కొత్తవాళ్లే అయినా.. ఫస్ట్ అటమ్ ప్రేక్షకులకి బాగా రీచ్ అవుతుంది. ఫ్యామిలీతో వెళ్లి చూసొచ్చే చక్కటి ఎమోషనల్ ఎంటర్టైనర్ నీ దారే నీ కథ ఒకటి.

ప్లస్ పాయింట్స్ : సెకండ్ ఆఫ్, విజయ్ విక్రాంత్ క్యారెక్టర్, సురేష్ గారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పోసాని కృష్ణ మురళి గారు.

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ లో అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్, క్లైమాక్స్.

ఫైనల్ వెర్డెక్ట్ : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్ : 2.5/5

Nee Daare Nee Katha Movie review:

Nee Daare Nee Katha Movie Telugu review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement