నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పుడు నందమూరి అభిమానులు, టీడీపీ అభినులు తెగ తిట్టిపోస్తున్నారు. నందమూరి, నారా ఫామిలీస్ కి దూరంగా ఉన్న నువ్వు చంద్రబాబు గెలిచిన సందర్భంలో వరసలు కలుపుతూ విశేష్ చెప్పావు. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు అని. మావయ్య గెలిస్తే విష్ చేసినోడివి ఆయన జైలుకెళ్ళినప్పుడు ఏమయ్యావ్ అంటూ ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు .
మరోపక్క నువ్వు గోవాలో దేవర షూటింగ్ తో బిజీగా వుండి.. సీఎం ప్రమాణస్వీకారానికి రాకపోతే పర్లేదు.. కానీ సాయంత్రానికే గోవా నుంచి హైదరాబాద్ కి వచ్చేసావ్.. ఇలా ఎందుకు అభిమానుల గుండెల్లో గుచ్చుతూ బాధపెడుతున్నావ్ అంటూ ఎన్టీఆర్ ని నందమూరి, టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.
మరోపక్క మెగా హీరో అల్లు అర్జున్ ని అయితే మెగా అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి రాలేవు కానీ.. ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్ళావు. వెళ్లి అక్కడేమన్నా నీ ఫ్రెండ్ ని గెలిపించావా.. ఇక్కడ పవన్ గెలిచారు. అదే నువ్వొస్తే నీ వల్లే ఓట్లు పడ్డాయని అల్లు అభిమానులు చంకలు గుద్దుకునేవారు. నిన్న పవన్ ప్రమాణస్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది.
కానీ అల్లు ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు. రామ్ చరణ్ చూడు ఎక్కడ ఎలాంటి ఈగో లేకుండా బాబాయ్ కోసం వచ్చాడు. నువ్వు పవన్ ని నీ సొంత మనిషి అనుకోవడం లేదు కనకే ఇలా చేసావ్ అంటూ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు.