మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు కల్కి చిత్రంలోని బుజ్జికి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆమె కూడా కల్కి 2898 AD లో భాగమైపోయింది. ఆ చిత్రం ఈనెల 27 న విడుదలకు రెడీ అవుతుంది. ఇక మహానటిలో బరువు పెరగడంతో పాటుగా.. ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించిన కీర్తి సురేష్ కొన్నాళ్లుగా గ్లామర్ కి కేరాఫ్ గా మారిపోయింది.
సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ గ్లామర్ చమక్కులు తెగ వైరల్ అవుతున్నాయి. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో అందాలను ఎలా ఆరబొయ్యలో కీర్తి సురేష్ దగ్గరే నేర్చుకోవాలేమో అన్నంతగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ తో మెసమైజ్ చేస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో చీర కట్టులో బ్యూటిఫుల్ గా కనువిందు చేసింది.
సిస్టర్ వెడ్డింగ్ అంటూ గోల్డ్ కలర్ శారీ లో కీర్తి సురేష్ ని చూడగానే.. ఏమని పొగడాలి ఈ అందాన్ని అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అంత చక్కగా ముద్దబంతిలా మురిపెంగా కనిపించింది. పెళ్ళిలో ఆ శారీ తో కీర్తి సురేష్ తెగ సందడి చేసింది. మీరు కూడా కీర్తి సురేష్ కొత్త ఫోటోలని ఓ లుక్కెయ్యండి..