Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఉండాల్సిన స్థానంలో చరణ్


నందమూరి, నారా ఫ్యామిలీస్ కి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో దగ్గరి వాడు. హరికృష్ణ చనిపోకముందు కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ కి కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేసేవాడు. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ని వదలడం లేదు. కానీ నందమూరి ఫ్యామిలీ మాత్రం ఎన్టీఆర్ తో దూరం జరుగుతూనే ఉంది. నారా చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ కి దగ్గరైనా.. ఎందుకో ఏమో ఎన్టీఆర్ ని ఆయన కూడా దూరం పెట్టేసారు. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. చంద్రబాబు 2024 ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో ఎన్టీఆర్ ప్రియమైన బాలయ్య, బాబాయ్, అత్తా అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈరోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది అని కొందరు, మరొకొందరు ఎన్టీఆర్ కి ఎలాంటి ఆహ్వానం అందలేదు అని, టీడీపీ బాధ్యతగా ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపింది, ఎన్టీఆర్ వేళ్తాడో వెళ్ళాడో అని చాలామంది మాట్లాడుకున్నారు. 

ఇక ఈరోజు ఫంక్షన్ లో ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ ఎన్టీఆర్ స్థానంలో రామ్ చరణ్ హైలెట్ అయ్యాడు. చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానంతో ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ బాలయ్య కుమర్తె బ్రాహ్మణి పక్కనే కూర్చున్న సందర్భం, రామ్ చరణ్ ఫ్యామిలీతో చంద్రబాబు ని కలిసినప్పుడు బాబు గారు రామ్ చరణ్ భుజంపైన చెయ్యి వేసిన సీన్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. 

బ్రాహ్మణి పక్కన అన్న స్థానంలో ఎన్టీఆర్ ఉంటే బావుండేది. చరణ్ పై చెయ్యి వేసినట్టుగా ఎన్టీఆర్ పై చంద్రబాబు చెయ్యి పడితే బావుండేది.. ఎన్టీఆర్ అన్న ఉండల్సిన స్థానంలో ఈరోజు చరణ్ కనిపించాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Charan is where NTR should be:

Ram Charan grand entry at Chandrababu oath ceremony
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs