Advertisement

ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేసాయి


2014 లో జనసేన పార్టీ ని పొత్తులో భాగంగా టీడీపీ-బీజేపీ తో కలిసి పని చేసినా పవన్ కళ్యాణ్ ని లైట్ తీసుకున్నారు ఆయన అభిమానులు. అప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త తగ్గారు. 2019 లో టీడీపీ-బీజేపీ లతో జట్టు కట్టకుండా సోలో గా ఎన్నికలకి వెళ్లారు. అప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ ఆయన్ని నిలువునా ముంచేశారు. కనీసం ఆయన ఎమ్యెల్యేగా కుడా గెలవలేకపోయారు. అదే సినిమాలు చేస్తే ఆహా ఓహో అనే అభిమానులు ఆయన్ని రాజకీయంగా ఎదగనివ్వలేదు. 

Advertisement

దానికి కారణం లేకపోలేదు.. ఎక్కడ ఓట్లేసి గెలిపిస్తే ఆయన సినిమాలని పక్కనపెటేస్తారో ఏమో అనే భయంతో పాటుగా.. సినిమా స్టార్ ఆయనకి రాజకీయ అనుభవం ఏముంది.. ఆయన గెలిచి ఏం చేస్తారులే అనే నిర్వేదంలో పవన్ కళ్యాణ్ కి ఓట్లెయ్యలేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పట్టువదల్లేదు. గత రెండేళ్లుగా ఎక్కువగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాజకీయాల్లోనే గడిపారు. 

మధ్య మధ్య లో సినిమాలు చేసినా ఎక్కువగా దృష్టి మాత్రం రాజకీయాల పైనే పెట్టారు. గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ ఏపీలో చేసిన రాజకీయం తెలియంది కాదు.. ఫోన్ ఉన్న ప్రతోడు, సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు పవన్ కష్టాన్ని గమనించే ఉంటారు. ఈ ఎన్నికల్లో కూటమితో బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలిచి తన పార్టీ ని కూడా గెలిపించుకుని ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.

ఈరోజు జూన్ 12 న కేసరపల్లిలో జరిగిన సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథమహారధులు హాజరవగా.. అభిమానులు, కుటుంబ సభ్యుల నడుమ.. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ కళ్యాణ్ ఉపముఖ్యంమత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి. పవన్ భార్య అన్న, మెగాస్టార్ చిరు కళ్ళల్లో నీళ్లు తిరగగా.. పవన్ అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటింది. 

పదేళ్లుగా పవన్ పడిన శ్రమ, ఆయన కష్టానికి ప్రతి ఫలం ఈరోజు దక్కింది, అభిమానులు అర్ధం చేసుకున్నారు. కాబట్టే గెలిపించారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. 

The fans got goose bumps:

Pawan Kalyan Takes Oath As Minister in Andhra Cabinet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement