Advertisement
Google Ads BL

CBN ప్రమాణ స్వీకారంలో స్పెషల్ వాళ్లిద్దరే!


ఈరోజు బుధవారం ఉదయం గన్నవరం దగ్గరలోని కేసరిపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. పీఎం మోడీ దగ్గర నుంచి కేంద్ర మంతులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినిమా స్టార్స్ రజినీకాంత్, చిరంజీవి ఇలా అందరూ సీఎం గా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

మెగాస్టార్ ని నందమూరి బాలకృష్ణ సాదదరముగా ఆహ్వానించిన వీడియోస్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో మెగాస్టార్ ముచ్చట్లు, అలాగే నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ తో మెగాస్టార్ తో ఆత్మీయంగా చేసిన హడావిడి అన్ని ఈ వేడుకలో హైలెట్స్ గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రాగా.. స్టేజ్ పై అన్న చిరు కాళ్ళకి పవన్ పాదాభివందనం చేయడం ఆకట్టుకుంది. 

ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం అందగా.. ఆయన ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కేసరిపల్లి చేరుకున్నారు. అయితే ఆ చంద్రబాబు కోడలు, బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి పక్కనే చరణ్ కూర్చుని చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార సమయంలో మాట్లాడుకుంటూ కనిపించిన వీడియో మాత్రం అందరిని బాగా ఆకర్షించింది. 

బ్రాహ్మణి-రామ్ చరణ్ పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న వీడియో చూసి అటు నందమూరి ఇటు మెగా అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఇలాంటి సన్నివేశాలు చూడడానికి భలే ఉంటాయి అని మాట్లాడుకుంటున్నారు.  

Charan and Nara Brahmani Visuals At CBN oathing ceremony:

Ram Charan and Nara Brahmani Visuals At Chandrababu oathing ceremony
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs