Advertisement
Google Ads BL

ఇంతకీ కృతి శెట్టి పరిస్థితి ఏమిటి?


ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇప్పుడు నెమ్మదిగా మరోసారి టాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఉప్పేన చిత్రంతో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆమెకి అంతటి బ్రేకిచ్చే సినిమా ఇంతవరకు తగల్లేదు. మధ్యలో శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలు హిట్ అయినా.. కృతి శెట్టి పేరు అంతగా మోగలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆమెని బాగా ఇబ్బంది పెట్టేశాయి. కస్టడీ తర్వాత కృతి శెట్టి మళ్ళీ ఏడాది గ్యాప్ తీసుకుని శర్వానంద్ తో మనమే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
CJ Advs

మనమే విజయంపై కృతి శెట్టి చాలా ఆశలు పెట్టుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్, ఆడియన్స్ కూడా మిక్స్డ్ టాక్ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం లో కృతి శెట్టి మోడ్రెన్ గానే కనిపించింది. కానీ ఆమె పాత్రకి అంత వెయిట్ లేదు. అంటే మనమే సినిమాలో కృతి శెట్టి పాత్ర గొప్పగా ఉండటం కానీ ఆ పాత్ర వల్ల ఆమె కెరీర్‌ మరింత స్పీడ్‌ అందుకోవడం వంటి అద్భుతాలు ఏమి జరగలేదనే చెప్పాలి.

మరి మనమే హిట్ అయితే కృతి శెట్టి వైపు యంగ్ హీరోల చూపు పడేది. ఎందుకంటే కృతి శెట్టి ఒకప్పుడు ట్రెడీషనల్ గర్ల్ గా కనిపించేది కానీ.. ఇప్పుడు టోటల్ గా గ్లామర్ వైపు టర్న్ అయ్యింది. మనమే చిత్రంలో అటు గ్లామర్ గాను ఆకట్టుకుంది. ఇటు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోసే పని పెట్టుకుంది. కానీ మనమే రిజల్ట్ ఆమెని, ఆమె అభిమానులని డిజ్ పాయింట్ చేసింది.

ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో మనమే తర్వాత ఆమెకి మరో ప్రాజెక్ట్ లేదు. 

So what is Kriti Shetty situation?:

Kriti Shetty who lost hope with Manamey?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs