Advertisement
Google Ads BL

విజయవాడకి సూపర్ స్టార్ రాక


గత ఏడాది సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్స్ బర్త్ డే వేడుకల కోసం విజయవాడకి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్.. మాటల సందర్భంలో హైదరాబాద్ ని డెవెలెప్ చేసింది నా మిత్రుడు చంద్రబాబు అని చెప్పినప్పటి నుంచి రజినీకాంత్ ని వైసీపీ నేతలు, మంత్రులు విపరీతంగా ట్రోల్ చేసారు. రజినీకాంత్ చెప్పింది 100 శాతం కరెక్ట్ కానీ దానిని వైసీపీ నేతలు డైజెస్ట్ చేసుకోలేక సూపర్ స్టార్ నే ట్రోల్ చేసారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్నేహతుడు చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి విజయవాడకి రాబోతున్నారు. ఇప్పటికే  ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకొని రేపు ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకాబోతున్నట్టుగా తెలుస్తోంది. 

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి అతిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. పలువురు ప్రముఖులు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని టాప్ హోటల్స్ కి చేరుకొని అక్కడ బస చేసి.. ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 

చాలామంది మెగాస్టార్-బాలకృష్ణ లు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఎలా ఉండబోతుంది అనే ఆతృతలో ఉంటే.. మరికొందరు మెగాస్టార్ చిరు-పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ కలిసి కనిపించే క్షణం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొందరు జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం పరితపిస్తున్నారు. 

Arrival of superstar in Vijayawada:

Rajinikanth off to Vijayawada for Chandrababu Oath Ceremony
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs