రేపు జూన్ 12 ఉదయం చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. చంద్రబాబు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి పీఎం మోడీ దగ్గర నుంచి అతిరథ మహారధులు హాజరవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా విజయవాడకి చేరుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ కి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రమాణ స్వీకార ఆహ్వానం పంపించారు..
అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎవరు వచ్చినా.. రాకపోయినా.. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా.. రాడా.. అనేది హాట్ టాపిక్ గా మారింది. కారణం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది. ఒకప్పుడు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ కొన్నేళ్ళుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. నందమూరి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం, ఎన్టీఆర్ దూరంగా ఉండడం టీడీపీ లోని ఓ వర్గానికి నచ్చకపోయినా.. బాబు గారిని చూసి సర్దుకుపోతున్నారు.
అటు ఎన్టీఆర్ కూడా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కానీ, అత్త భువనేశ్వరిని వైసీపీ నాయకులు విమర్శించినప్పుడు కానీ స్పందించకపోవడంతో ఎన్టీఆర్ పై టీడీపీ లోనే నెగిటివి పెరిగిపోయింది. జూన్ 4 న చంద్రబాబు 2024 ఎన్నికల్లో అత్యధిక సీట్లతో గెలవగా జూన్ 5న ఎన్టీఆర్ ప్రియమైన మావయ్య అంటూ సంభోదిస్తూ ట్వీట్ చెయ్యడంపైన అనేక విమర్శలొచ్ఛాయి. అందుకే టీడీపీ బాధ్యతగా ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపించినా ఎన్టీఆర్ హాజరు పై సర్వత్రా ఆసక్తి మొదలైంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరవుతున్నా జూనియర్ ఎన్టీఆర్ రాక పై సస్పెన్స్ మొదలైంది. ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తాడా.. రాడా అని ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారు.