Advertisement
Google Ads BL

విడుదలకు ముందు కల్కి నుంచి మరో ట్రీట్


ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం కల్కి 2898 AD చిత్ర ప్రమోషన్స్ ఓ రేంజ్ లో మొదలు కావడమే కాదు.. అందరూ కల్కి నామ జపం చేస్తున్నారు. కల్కి బుజ్జి ఈవెంట్స్ దగ్గర నుంచి నిన్న వదిలిన కల్కి 2898 AD ట్రైలర్ వరకు అందరూ ఇది పాన్ ఇండియా ఫిలిం కాదు పాన్ వరల్డ్ రేంజ్ అంటూ మాట్లాడుతున్నారు. 

Advertisement
CJ Advs

నిన్న విడుదలైన కల్కి ట్రైలర్ లో కథ రివీల్ అవ్వకుండా... విలన్ పాత్రధారి కమల్ హాసన్ ని రెండు సీన్స్ కే పరిమితం చేసేసారు. కమల్ హాసన్ క్రూయల్ రోల్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవ్వకపోయినా షాకయ్యారు. కానీ కల్కిలో కమల్ పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందనే లీక్ కొన్ని వారాల క్రితమే చక్కర్లు కొట్టింది.  

ఇక కల్కి చిత్రంలో దీపికా కి జన్మించే బాబు ఎవరు? అమితాబచ్చన్ ఆ అబ్బాయిని ఎందుకంతగా కాపాడాలనుకుంటున్నాడు? ప్రభాస్-దీపికా పదుకొనె మధ్యన రొమాన్స్ వుంటుందా? మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ అతిధి పాత్రల్లో ఎలా కనిపిస్తారు? అనే విషయంలో అందరిలో ఎన్నో ప్రశ్నలు. 

మరి అవన్నీ పక్కన పెడితే కల్కి జూన్ 27 న విడుదల కాబోతుంది. కల్కి విడుదలకి ముందు మరో స్పెషల్ ట్రీట్ మేకర్స్ సిద్ధం చేసే అవకాశం లేకపోలేదట. అదే కల్కి నుంచి రిలీజ్ ట్రైలర్ ఉండొచ్చని అంటున్నారు. మరోపక్క కల్కి ట్రైలర్ వీక్షించిన యూత్ కల్కి టికెట్స్ కోసం అప్పుడే ప్రయత్నాలు స్టార్ట్ చేసేసారు. 

Another treat from Kalki before the release:

Prabhas, Amitabh Bachchan Sci-Fi Epic Kalki 2898 AD trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs