Advertisement
Google Ads BL

జగన్ పై తిరువూరు మాజీ ఎమ్యెల్యే నిరసన


వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, లేదంటే రాష్ట్ర అభివృద్ధిని లైట్ తీసుకోవడం కానివ్వండి, సొంత ఎమ్యెల్యేలని, మంత్రులని జగన్ విస్మరించడం కానివ్వండి, తన మంత్రి వర్గంలోనే బూతులు మాట్లాడినా, లేదంటే తప్పు చేసినా కానీ పట్టించుకోనట్లుగా ఉండిపోవడం కానివ్వండి.. ఇలానే చాలా ఉన్నాయి వైసీపీ ఓటమికి కారణాలు.

Advertisement
CJ Advs

చాలామంది వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఒక్కక్కరిగా జగన్ పై ధ్వజమెత్తుతున్నారు. వైసీపీ ఓటమికి జగన్ ముఖ్య కారణమంటూ మీడియా ముందు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అందులో తిరువూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రక్షణ నిధి జగన్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.

జగన్ నీవల్లే వైస్సార్సీపీ ఓడిపోయింది, జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు.. బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్టానికి  చేసింది శూన్యం.. జగన్ వల్లే తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయా.. ఇళ్లు కట్టిస్తానని చెప్పావ్. రోడ్ల అభివృద్ధికి పది కోట్లు అడిగా అది ఇవ్వలేదు, అసలు నువ్వు ఎవ్వరిని లెక్క చెయ్యలేదు. పార్టీ కార్యకర్తలని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించలేదు. ఎమ్యెల్యేలని లైట్ తీసుకున్నావు.

మరోపక్క చంద్రబాబు, పవన్ పార్టీలని ఎంత చక్కగా గెలిపించుకున్నారో.. ఒక ఎంపీకి ఫ్లైట్ టికెట్ లేదు అంటే.. పిలిచి మరీ అడిగారు చంద్రబాబు. కానీ నువ్వెప్పుడూ వైసీపీ ఎమ్యెల్యేలతో, మంత్రులతో మాట్లాడిన పాపాన లేదు. నీకు అంత సమయం లేదా.. అదే నేను అడుగుతున్నాను. నీవల్లే వైసీపీ ఓడిపోయింది అంటూ.. మాజీ సీఎం జగన్ ను తూర్పార పట్టిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రక్షణ నిధి. 

Tiruvuru former MLA is critical of Jagan:

Tiruvuru ysrcp leader Rakshana Nidhi das slammed party chief YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs