నిజంగా ఈ ఎన్నికలో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు కోరుకోలేదు. 2014 లో బిజెపి, జనసేన పొత్తుతో గెలిచిన చంద్రబాబు 2019కి వచ్చేసరికల్లా బీజేపీ కి బై బై చెప్పేసి కాంగ్రెస్ తో చేతులు కలిపి ఘోరంగా దెబ్బతిన్నారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా సోలో ఫైట్ చేద్దామని డిసైడ్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ కాదు పొత్తు పెట్టుకోవాల్సిందే అని కూర్చున్నారు. కానీ చంద్రాబాబుకి బీజేపీ తో కలవడం ఇష్టంలేదు.
దానితో పొత్తు మేటర్ హోల్డ్ లో ఉండిపోయింది. పవన్ ఎంతగా కదిలించినా బాబు ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే చంద్రబాబు జైలుకెళ్లారో.. అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి బాబు గారిని ఒప్పించి పొత్తుని ప్రకటించారు. అయినప్పటికి చంద్రబాబు, లోకేష్ బీజేపీ విషయంలో అంటీ ముట్టనట్టుగానే ఉండిపోయారు. అయినా పవన్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు-బీజేపీ కలిసి పని చేసేలా చెయ్యడంలో సఫలీకృతులు అయ్యారు.
ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది. పొత్తులో భాగంగా చంద్రబాబు, మోడీ, పవన్ మీటింగ్స్ పెట్టారు, పబ్లిక్ లోకి వెళ్లారు, పోరాడారు.. ఫైనల్ గా గెలిచారు. గెలిచిన వెంటనే చంద్రబాబు పొత్తు ధర్మానికి కట్టుబడి ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లి మరీ పవన్ కి కృతఙ్ఞతలు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఎంతగా నమ్మారో అక్కడే అర్ధమైపోయింది. లోకేష్ కి అన్నగా మారిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో సముచిత స్థానం వరించబోతుంది.
హోమ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ సిఎం పదవిని కానీ పవన్ తీసుకోబోతున్నారనే ప్రచారానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి సీఎం తో సమానమైన సముచిత స్థానం ఇవ్వాలని, సీఎం తో పాటు పవన్ కి కూడా అదే మాదిరి ప్రొటో కాల్ ఉండేలా చంద్రబాబు చూసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే చంద్రబాబు నమ్మితే ప్రాణమిస్తారని అనిపించడం లేదూ.!