Advertisement
Google Ads BL

కల్కి.. అమరావతి ఎదురు చూస్తోంది


ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కల్కి 2898 AD చిత్ర న్యూస్ లతో నిండిపోయింది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న కల్కి చిత్ర ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా రామోజీ ఫిలిం సిటీలో కల్కి బుజ్జి కార్ రివీల్ ఈవెంట్ గ్రాండ్ గా  నిర్వహించిన మేకర్స్.. నిన్న జూన్ 10 న కల్కి ట్రైలర్ విడుదల చేసారు.

Advertisement
CJ Advs

కల్కి 2898 A D చిత్ర ట్రైలర్ వీక్షించిన అందరూ ఇది పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్.. రాజమౌళి కాదు ఆడియమ్మ మొగుడు నాగి అంటూ కామెంట్ చేస్తున్నారు. కల్కి విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ప్రభాస్ భైరవ లుక్, అమితాబ్ అశ్వద్ధామ, దీపికా, దిశా పటాని కేరెక్టర్స్, కమల్ కేరెక్టర్ అన్ని ఈ చిత్రంపై అంచనాలు పెంచేసేలా చేసాయి. ఇప్పడు మరో క్రేజీ వార్త వైరల్ గా మారింది.

అది వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు కల్కి 2898 AD చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమరావతిలో జరప తలపెట్టనున్నారనే వార్త విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. అశ్విని దత్ సన్నిహితుడు చంద్రబాబు సీఎం గా రేపు ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. అమరావతికి పూర్వ వైభవం తేబోతున్నారు. అందుకే కల్కి ఈవెంట్ ని అమరావతిలో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దానితో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి.. అమరావతి ఎదురు చూస్తోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గత ఐదేళ్లుగా వైజాగ్ లాంటి ఏరియాల్లో తప్ప పెద్దగా ఏపీలో సినిమా ఈవెంట్స్ నిర్వహించలేదు. ఆదిపురుష్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఇప్పుడు కల్కి తోనే అమరావతిలో సినిమా ఇండస్ట్రీ నుంచి కదలిక తేవాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా టాక్. 

Kalki.. Amaravati is waiting:

   The makers are thinking what if the Kalki event is planned in Amaravati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs