పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం కల్కి 2898 AD సందడి రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన బుజ్జి ఈవెంట్ తోనే మొదలయ్యింది. అప్పుడే కల్కి రేంజ్ ఏమిటనేది అందరికి అర్ధమైపోయింది. నేడు జూన్ 10 వదిలిన ట్రైలర్ తో ఇది పాన్ ఇండియా ఫిలిం కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ అంటూ ఆడియన్స్ చేస్తున్న కామెంట్స్ వింటే ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి ట్రైలర్ లోకి వెళితే.. ఈ భూమి మీద మొదటి నగరం.. ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ అంటూ మొదలైన కల్కి 2898 AD ట్రైలర్.. లో అశ్వద్ధామ గా అమితాబచ్చన్ దీపికా పదుకొనె కి ఇచ్చిన భరోసా.. ప్రభాస్ ఎంట్రీ తోనే పొద్దు పొద్దున్నే ఫైట్ ఏంటి బుజ్జి.. అంటూ ఫన్నీ గా ఇచ్చిన ఎంట్రీ రికార్డ్స్ చూసుకో.. ఒక్క యుద్ధం కూడా ఓడి పోలేదు.. ఇది కూడా ఓడిపోను అని ప్రభాస్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దీపికా పదుకొనె ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి అంటూ చెప్పిన డైలాగ్ తో.. భయపడకు మరో ప్రపంచం వస్తుంది అంటూ కమల్ హాసన్ క్రూరమైన రోల్ ని పరిచయం చేసారు.
ప్రభాస్ భైరవగా యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగ్గొట్టేయ్యగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అరిపించేసారు, కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో క్రూరత్వాన్ని చూపిస్తున్నారు. దీపికా రోల్ ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. ఇంకా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి ఇలా ప్రతి పాత్రకి తగిన ప్రాముఖ్యత ఉండబోతున్నట్టుగా ట్రైలర్ లో స్పష్టం చేసారు. ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ తో చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
నాగ్ అశ్విన్ మేకింగ్ చూస్తే కల్కి పై ఇంటెర్నేషన్ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ ఆఫ్ ద డెకేడ్ గా ప్రభాస్ అభిమానులు చెబుతున్న కల్కి 2898 ఏడీ నిజంగానే మనల్ని పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.