Advertisement
Google Ads BL

రోజాపై షకలక శంకర్ సెన్సేషనల్ కామెంట్స్


 

Advertisement
CJ Advs

జబర్దస్త్ కి జెడ్జ్ గా ఉన్నప్పుడు రోజా ని దేవతలా పూజించిన జబర్దస్త్ కమెడియన్స్.. నిన్న మొన్నటివరకు ఆమెని చాలా అభిమానించేవారు. జబర్దస్త్ నుంచి రోజా వెళ్ళిపోయినా.. జబర్దస్త్ కమెడియన్స్ ఎవరైనా నూతన గృహప్రవేశం చేసినా, లేదంటే ఏదైనా శుభకార్యాలు చేసినా ఆమెని అతిధిగా పిలిచేవారు. కిర్రాక్ అర్పి అయితే చేపల పులుసు ఓపెనింగ్ కి ఆమెని పిలిచాడు. అలాంటి కమెడియన్స్ అంతా ఇపుడు రోజాని తిడుతున్నారు.  

కారణం రోజా తనకి శత్రువైన పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడడంతో పాటుగా, పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తూ ఆయన కోసం పిఠాపురం, ఇంకా ఏపీలో జనసేన తరపున ప్రచారం చేసిన జబర్దస్త్ కమెడియన్స్ పై రోజా నోరు పారేసుకుంది. మెగా ఫ్యామిలీ హీరోలకి యాంటీగా మారితే అవకాశాలు రావనే భయంతోనే పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ కమెడియన్స్ పని చేసారంటూ చులకనగా మాట్లాడింది. 

అప్పుడే కిర్రాక్ ఆర్పీ రోజాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఆ తర్వాత ఆది, సుధీర్, శ్రీనులాంటి కమెడియన్స్ మేము పవన్ మీద అభిమానంతోనే ప్రచారం చేసాము, ఎవరికో భయపడి కాదు అన్నారు. ఇక ఆర్పి చేప్పినట్టుగా రోజా నగరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. 

షకలక శంకర్ తాజాగా..  తప్పు చేసినవాళ్లని వదిలిపెట్టరని, అది ఇవాళ కాకపోయినా రేపైనా తప్పదని, అధికారముంది అని అనడమెందుకు, రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉంటే మాత్రం మనుషుల్ని మర్చిపోతారా, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, గెలిస్తే విర్రవీగకూడదు, గెలుపు ఏమైనా శాశ్వతమా. 

ఇంకా అప్పుడే అయ్యిపోలేదు.. రోజా అన్న మాటలన్నీ బయటకు తీస్తారని, ఇవాళ చేసిన పాపం రేపటితో క్లియర్ అయిపోవాల్సిందేనని శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

Shakalaka Shankar Sensational Comments on Roja:

Comedian Shakalaka Shankar lashed out at RK Roja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs