Advertisement
Google Ads BL

మార్నింగ్ బాలయ్య-ఈవెనింగ్ ప్రభాస్


ఈరోజు జూన్ 10.. సోషల్ మీడియా మొత్తం బాలయ్య-ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ తో నిండిపోవడమే కాదు, ప్రస్తుతం బాలయ్య, ప్రభాస్ ఇద్దరిని వారి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. జూన్ 10 బాలయ్య బర్త్ డే. మరి హ్యాట్రిక్ హిట్స్ తో అలాగే హ్యాట్రిక్ విజయాలతో ఎమ్యెల్యేగా ఉన్న బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయో ఊహించడమెందుకు సోషల్ మీడియా ఓపెన్ చూస్తే తెలుస్తోంది.

Advertisement
CJ Advs

బాలకృష్ణ కొత్త సినిమాల అప్ డేట్స్, అలాగే హిందూపూర్ ఎమ్యెల్యేగా గెలిచిన తర్వాత ఆయన బర్త్ డే రావడంతో అక్కడికే వెళ్లి తాను నామినేషన్ వేసిన హనుమాన్ టెంపుల్ లో స్పెషల్ పూజలు నిర్వహించారు. ఇక బాలకృష్ణ అభిమానులు ఊరు వాడా కేక్స్ కట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. మరి ఉదయమంతా బాలయ్య సోషల్ మీడియాని ఆక్యుపై చేసారు.

సాయంత్రానికల్లా సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ అభిమానుల కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. అంటే ఈ రోజు సాయంత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం కల్కి 2898 AD ట్రైలర్ రాబోతుంది. ఈరోజు జూన్ 10 సాయంత్రం 7 గంటలకి కల్కి ట్రైలర్ పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల కాబోతుండడం, దానికి సంబంధించి పోస్టర్స్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ స్టార్ట్ చేసేసారు.

మరి ఉదయమంతా బాలయ్య సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో సందడిగా మారగా.. సాయంత్రం కల్కి ట్రైలర్ రిలీజ్ తో ప్రభాస్ అభిమానుల సందడి షురూ అయ్యింది. 

Morning Balayya-Evening Prabhas:

Balayya Birthday day updates and Prabhas Kalki trailer update in social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs