Advertisement
Google Ads BL

మీనాక్షి దూసుకుపోతుంటే.. శ్రీలీల మాత్రం..


గుంటూరు కారంలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటించాల్సి ఉండగా.. ఈ చిత్రం నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి అంటే మొదటి హీరోయిన్ స్థానంలోకి శ్రీలీల వస్తే.. శ్రీలీల ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. అయితే మీనాక్షి గుంటూరు కారంలో కేవలం రెండుమూడు సన్నివేశాలకే పరిమితమైంది. 

Advertisement
CJ Advs

ఇక శ్రీలీల మహేష్ తో ఎక్కువసేపు కనిపించి, అదరగొట్టే డాన్స్ చేసినా అమ్మడు ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. కేవలం రెండు మూడు సీన్స్ లో మాత్రమే కనిపించిన మీనాక్షి చౌదరి మాత్రం బోలేడన్ని అవకాశాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజి, తమిళ స్టార్ హీరో విజయ్ తో జోడి కట్టింది. 

ఇక్కడ తెలుగు యంగ్ హీరోలతో అంటూ చాలా బిజీగా గడిపేస్తుంది. అటు మహేష్ తో ఫస్ట్ హీరోయిన్ గా చేసిన శ్రీలీల కెరీర్ లో బాగా డల్ అయ్యింది. ప్రస్తుతం ఆమెకి సినిమా ఆఫర్స్ రావడం లేదో.. లేదంటే వచ్చినా ఆచి తూచి అడుగులు వేస్తుందో అనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం అయితే శ్రీలీల ఫుల్ ఫ్రీ గా కనిపిస్తుంది.  

If Meenakshi is rushing.. but Sreeleela..:

Meenakshi Chaudhary in full swing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs