Advertisement

ఆద శర్మకి అరుదైన వ్యాధి


చిన్న చితక సినిమాలతో అంతగా పేరు తెచుకోలేని ఆద శర్మ కేరళ స్టోరీ చిత్రంతో ఒక్కసారిగా ట్రెండ్ అయ్యింది. ఆ చిత్రంలో హిందూ అయ్యుండి.. అనుకోని పరిస్థితుల్లో ముస్లిం గా మారిన యువతి పాత్రలో కనిపించింది ఆద. ఆ చిత్రం కాంట్రవర్సీ అవడంతో ఆద శర్మ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఆ చిత్రం తర్వాత ఆద శర్మ బస్తర్ చిత్రంలో నటిస్తుంది. 

Advertisement

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆద శర్మ సినిమాల కోసం బరువు తగ్గడం, మళ్లీ పెరగడం చెయ్యడం వలన తానొక అరుదైన వ్యాధి బారిన పడినట్లుగా చెప్పుకొచ్చింది. కేరళ స్టోరీలోని పాత్ర కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత బస్తర్ చిత్రం కోసం బరువు పెరగడానికి రోజు పది అరిటి పళ్ళు తినేదాన్ని. అంతేకాకుండా స్వీట్స్, లడ్డులు తినేదాన్ని. 

మరో సినిమా కోసం బరువు  తగ్గాల్సి వచ్చింది. అలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం, పెరగడం వలన నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ఒత్తిడికి గురవడంతో పీరియడ్స్ ఆగకుండా వచ్చేసేవి. అదే కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధిని బారిగా పడ్డాను. ఆ వ్యాధి వలన పీరియడ్స్ ఆగకుండా వస్తుంటాయి. నేను 48 డేస్ అలా పీరియడ్స్ తో ఇబ్బంది పడ్డాను అంటూ ఆదా శర్మ తనకొచ్చిన అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. 

Adah Sharma has a rare disease:

Adah Sharma Rare Disease And Details Recent Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement