ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీ రావు మరణంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ రామోజీ రావు కడసారి చూపు కోసం రామోజీ ఫిలిం సిటీకి వస్తాడని చాలామంది ఎదురు చూసారు. అయితే ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్ దేవర షూటింగ్ కోసం ప్రస్తుతం గోవా వెళ్ళాడు. గోవాలో రీసెంట్ గానే దేవర షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలయ్యింది.
వార్ 2 కోసం కొన్ని డేట్స్ కేటాయించడంతో దేవర షూటింగ్ లేట్ అవుతుంది అనే ఉద్దేశ్యంలో కొరటాల శివ దేవర షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. దేవర గోవా షెడ్యూల్ లో సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ ఇలా ప్రధాన తారగణం అంతా పాల్గొనబోతున్నారు. ఒక సాంగ్, అలాగే యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలని గోవా షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నారు.
అక్టోబర్ 10 న పాన్ ఇండియా మార్కెట్ లో దేవర విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే కొరటాల-ఎన్టీఆర్ దేవర షూటింగ్ త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా దేవర పూర్తయ్యాకే మళ్లీ వార్ 2 సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది.