పవన్ కళ్యాణ్ ప్లానింగ్ చూసి పవన్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తన వారసుడు అకిరా నందన్ విషయంలో ఏమి పట్టనట్టుగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలవగానే తన కొడుకుని రాజకీయంగా హైలెట్ చేస్తూ వస్తున్నారు. పవన్ గెలుపు మాట వినగానే అకీరా నందన్ బయటకొచ్చేసాడు. అప్పుడే అభిమానులు ఆనందం ఆపుకోలేకపోయారు.
చంద్రబాబు కి పరిచయం చేస్తూ ఆశీర్వాదం తీసుకున్న దగ్గర నుంచి పీఎం మోడీ కి బొకే ఇచ్చేవరకు అకీరా నందన్ బాగా హైలెట్ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ సడన్ గా అకీరా పై ఫోకస్ పెట్టడంపై అందరిలో పలు రకాల అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ వారసుణ్ణి నటన వైపు కాకుండా రాజకీయాలవైపు తీసుకొస్తున్నారేమో అనుకుంటున్నారు.
అయితే పవన్ ఇలా ఉన్నట్టుండి వారసుడిని హైలెట్ చేయడం వెనుక వేరే ప్లానింగ్ ఉంది అంటున్నారు. తాను ఇకపై రాజకీయాలతో బిజీ కాబోతుండడం వలన కొడుకు అకీరాని హీరోగా లాంచ్ చేసేందుకు ఇలా నేషనల్ వైడ్ అటెన్షన్ అకీరా పై ఉండేలా చూస్తున్నారు, త్వరలోనే అకీరాని హీరోగా ఇండస్ట్రీకి తీసుకొచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. మరి పవన్ హీరోగా తప్పుకున్నాకే అకీరా ఎంట్రీ ఉంటుందట.
ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంటే ఫ్యాన్స్ తట్టుకోలేరు. అందుకే ఆ సమయంలో కొడుకుని హీరోగా దించితే ఫ్యాన్స్ శాంతిస్తారు. అదన్నమాట పవన్ కళ్యాణ్ ప్లాన్.