ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్‌ని పవన్ కాదు.. తుఫాన్ అని మోడీ అన్నారో.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అంతా పవన్ కళ్యాణ్ గురించే చర్చలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒకప్పుడు జనసేన మీడియా సమావేశం జరిగినా.. అధ్యక్షుడు ర్యాలీ, సభలు జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని ఏ మీడియా కూడా వాటిని చూపించేవి కాదు. ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే అవి కనిపించేవి. అలాంటిది ఈ రోజు నేషనల్ మీడియా పవన్ నామస్మరణతో నిండిపోయిందంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుత రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి లేని చరిత్రను మొన్న జరిగిన ఏపీ ఎన్నికలలో జనసేన సృష్టించింది. పోటీ చేసిన అన్ని స్థానాలలో అంటే 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో విజయం సాధించి 100 శాతం సక్సెస్ రేట్ సాధించిన పార్టీగా జనసేన చరిత్రను లిఖించింది. అంతేనా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని శపథాలు చేసిన వారంతా ఓడిపోయి ఇళ్లలో ఉండిపోతే.. ఆయన అసెంబ్లీ కాదు.. నేరుగా పార్లమెంట్‌లోనే స్పీచ్ ఇచ్చి.. ఒక్కొక్కడి కూసాలు కదిలిపోయేలా చేశాడు. పవన్ కళ్యాణ్ విజయాన్ని కొలవడానికి ఇంతకంటే ఏం కావాలి.
ఇక మోడీ తుఫాన్ అని వర్ణించడంతో ఒక్కసారిగా నార్త్ మీడియా పవన్ కళ్యాణ్‌పై ఫోకస్ పెట్టి.. స్పెషల్ టైమ్ కేటాయించి మరీ జనసేనానిపై ప్రోగ్రామ్స్ వేస్తున్నారు. ఆజ్ తక్, ఎన్‌డిటివీ, ఇండియా టుడే వంటి ఛానల్స్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ చేయడమే కాక.. ఆయనని తుఫాన్‌గా వర్ణిస్తూ అభినందిస్తున్నారు. దీంతో నార్త్ మీడియాలో పవన్.. నిజంగా తుఫాన్‌గా మారాడు.