Advertisement
Google Ads BL

కత్రినా ప్రెగ్నెంట్.. అంతా ట్రాష్


బాలీవుడ్‌లో సోలో హీరోయిన్‌గా టాప్ స్టేటస్‌ని ఎంజాయ్ చేయలేకపోయినా.. స్పెషల్ సాంగ్స్‌తో దుమ్మురేపుతూ, గ్లామర్ కానివ్వండి, ఫిట్‌నెస్ కానివ్వండి.. ఇలా ప్రతి విషయంలో టాప్ హీరోయిన్స్‌కి పోటీ ఇచ్చింది కత్రినా కైఫ్. రణబీర్ కపూర్‌తో లవ్‌లో పడిన కత్రినా ఆ తర్వాత అతనితో బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత సింగిల్ స్టేటస్‌ని మైంటైన్ చేస్తూ కొన్నాళ్లు సీక్రెట్‌గా కుర్ర హీరో విక్కీ కౌశల్‌తో డేటింగ్ చేసిన కత్రినా కైఫ్.. పెళ్లి కూడా గుంభనంగానే చేసుకుంది. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ కుటుంబ సభ్యుల సమక్షంలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. 

Advertisement
CJ Advs

అప్పటినుంచి కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ చాలాసార్లు వార్తలు రావడం.. ఆ తర్వాత అవన్నీ రూమర్స్ అని తేలిపోవడం చూశాం. కానీ ఈమధ్యన అంటే దీపికా పదుకొనె ప్రెగ్నెంట్ అని ప్రకటించాక కత్రినా కైఫ్ కూడా ప్రెగ్నెన్సీ.. అందుకే ఆమె బేబీ బంప్‌తో కనిపిస్తుంది అంటూ చాలా రకాల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆమె లండన్‌లోనే బిడ్డని కంటుంది అని కూడా ప్రచారం జరిగింది. 

తాజాగా కత్రినా కైఫ్ ఎయిర్ పోర్ట్‌లో కనిపించింది. ఎప్పటిలాగే నాజూగ్గా, స్లిమ్‌గా పొట్ట కూడా ఫ్లాట్‌గా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ కాదు అంటూ సరిపెట్టుకున్నారు. విక్కీ కౌశల్‌తో సీక్రెట్‌గా డేటింగ్ చేసినట్టుగా.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయాన్ని సీక్రెట్‌గా దాచేసిందేమో ఈ జంట అని అంతా గుసగుసలాడారు. కానీ ఇప్పుడు కత్రినా ప్రెగ్నెంట్ అన్న విషయం అంతా ట్రాష్ అని తేలిపోయింది.

No Pregnancy To Bollywood Heroine Katrina Kaif:

Bollywood Heroine Katrina Kaif Pregnancy News was Only Trash
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs