నిన్న శనివారం తెల్లవారు జామున అనారోగ్య కారణాలతో కన్ను మూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు అంతిమ యాత్ర రామోజీ ఫిలిం సిటీలోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమై ... ఫిలిం సిటీ వీధుల గుండా అశేష జనవాహిని కడసారి వీడ్కోలతో.. నారాయణ మంత్రాలతో.. రామోజీ అమర్ రహే అంటూ నినాదాలతో ఆయన సొంతంగా నిర్మించుకున్న స్మృతి వనం దగ్గరకు సాగుతోంది.
రామోజీ రావు అంతిమ యాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనగా.. రామోజీ రావుకి అత్యంత ఆప్తుడిగా భావించిన నారా చంద్రబాబు నాయుడు రామోజీ పార్దీవదేహాన్ని మోయడం హైలెట్ అయ్యింది. రామోజీ రావు కి చంద్రబాబు కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఏ ప్రభుత్వం ఎన్ని పరీక్షలు పెట్టినా రామోజీ మాత్రం చంద్రబాబు పక్షాన నిలిచారు.
రామోజీ మృతి చెందిన విషయం తెలిసిన చంద్రబాబు నిన్న ఢిల్లీ లో పనులన్నీ పక్కనబెట్టి హుటాహుటిన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు రామోజీ అంతిమ యాత్రలో పాల్గొనడమే కాకుండా ఆయన పాడె కూడా మోశారు. దానితో వీరి మధ్యన ఉన్న అనుబంధం ప్రత్యేకంగా మారింది.