Advertisement
Google Ads BL

కొడాలి నానికి, వంశీకి చుక్కలే..


వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై రెచ్చిపోయి కారు కూతలు కూసిన వైసీపీ నేతలకి ఇకపై టీడీపీ కార్యకర్తలు చుక్కలు చూపించడం ఖాయంగానే కనిపిస్తుంది. ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వాన్ని చూసుకుని విర్రవీగిన కొడాలి నాని, వల్లభనేని వంశీలకి ఇక మూడినట్లే అని చెప్పుకుంటున్నారు. 
బూతు మంత్రిగా పేరు గాంచిన కొడాలి నాని ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలు రాళ్ళూ, గుడ్లు విసిరి తమ అధినేతను నీచమైన మాటలన్నందుకు గాను శిక్షించే ప్రయత్నం చేశారు. మరోపక్క వల్లభనేని వంశీపై కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేస్తారేమో అన్నంత కసితో టీడీపీ అభిమానులు ఉన్నారు. 
కొడాలి నాని, వల్లభనేని వంశీలని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.. కొడాలి నానికి కానీ.. వంశీకి కానీ సపోర్ట్ చేసే లుచ్చా బ్యాచ్‌కి కూడా ఉంటుంది జాగ్రత్త.. అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూస్తుంటే కొడాలి నానికి, వంశీకి రాబోయే రోజుల్లో చుక్కలు గట్టిగానే కనిపించేలా ఉన్నాయి.

Advertisement
CJ Advs

TDP Activists Fire on Nani and Vamsi:

TDP Activists Warning To Kodali Nani and Vallabhaneni Vamsi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs