మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో కనబడుతుంది. సినిమా షూటింగ్స్ ఎలా ఉన్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ తో యూత్ ని పడేస్తున్న శ్రీలీల సౌత్ అవకాశాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అది కూడా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో శ్రీలీల ని హీరోయిన్ గా అనుకుంటున్నారని తెలుస్తోంది. మాద్దాక్ ఫిలింస్ బ్యానర్ పాటి జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో ఇబ్రహీం అలీ ఖాన్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు సైఫ్ ప్లాన్ చేశారట.
ఈ చిత్రంలో శ్రీలీల అయితే బావుంటుంది అనుకుంటున్నారట. సౌత్ లో వరస పరాజయాలతో కాస్త డల్ అయిన శ్రీలీల కి హిందీలో ఎంత త్వరగా ఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తుంది అని ఆమె అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇప్పటికే సాయి పల్లవి లాంటి హీరోయిన్ హిందీ డెబ్యూ కి రెడీ అయిన విషయం తెలిసిందే. మరి శ్రీలీల ఆఫర్ కూడా కన్ ఫర్మ్ అయితే ఆమె లక్కీ అనే చెప్పాలి.