ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు మరణం అనేకమందికి తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేసింది. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది.. పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారాముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.