ఏపీలో అత్యంత దారుణ ఓటమి చవి చూసిన వైసీపీ అలాగే జగన్ బ్యాచ్ అంతా ఇప్పడు ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటున్నారు. మంత్రులుగా ఉండి ఓడిపోయిన వారు, ఎమ్యెల్యేగా కుడా గెలవలేని కొంతమంది జగన్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ కి హాజరైతే.. జగన్ ని అవాయిడ్ చేస్తూ జగన్ ఓటమికి గల కారణాలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.
జగన్ ఓటమికి ఎక్కువగా వినిపిస్తున్న కారణం ఒక్కటే. జగన్ కి సన్నిహితమైన వారు మాత్రమే జగన్ దగ్గరకు వెళ్లగలిగే వారు. మిగతా ఎమ్యెల్యేలు, వైసీపీ కార్యకర్తలెవరూ జగన్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ ఇవ్వకుండా గంటలు, రోజుల తరబడి వెయిట్ చేయించేవారు, ఆ విషయం ఎవ్వరికి చెప్పుకోలేరు అంటూ వైసీపీ నుంచి దారుణ పరాజయం పాలైన పలువురు వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డురంగా కనిపిస్తుంది.
సీఎం పేషీలో ఎవరెవరో గంటలు తరబడి మట్లాడుతూ ఉంటారు. ఆయనకి కావల్సిన వారు మాత్రమే జగన్ దగ్గరగా వెళ్లగలిగేవారు, కానీ మిగతా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్యెల్యేలకి జగన్ తో మాట్లాడే అవకాశం దొరకడం కష్టంగా మారింది.. ఎంతోమంది ఎన్నోసార్లు CMO ముందు వెయిట్ చెయ్యడం చూసాం. అందుకే వైసీపీ ఇంత దారుణమైన ఓటమిని చూడాల్సి వచ్చింది అంటూ ధర్మవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కేతిరెడ్డి సోషల్ మీడియాలో వదిలిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.