ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచేవరకు ప్రజల పక్షాన పోరాడుతాడు. గెలిచాక డబ్బు మీద వ్యామోహంతో అడ్డమైన దారులు తొక్కుతాడు. అందులో ఎవ్వరు గొప్పవారు కాదు అలాగని ఎవ్వరు చెడ్డవారు కాదు. కాలం వారిని మార్చేస్తుంది. ఏపీలో చంద్రబాబు వస్తే ఎవ్వరికి ఒరిగేది ఉండదు, రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అనే ఆశ తప్ప. ఇక జగన్ వస్తే ఎవ్వరికి ఏమి ఒరిగదు. ఇప్పుడు ఆయన వస్తే రాష్ట్రం నాశనమైపోతుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది.
అయితే ఏ రాజకీయ నాయకుకుడు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న తీరు చూస్తుంటే అందరిలో ఒక్కడిగానే పవన్ ఉండడు అనిపిస్తుంది. అదే పవన్ ఫాన్స్, జనసైనికులు కోరుకునేది. అంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఏదో చెయ్యాలనే తపన పవన్ కళ్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు.
తనతో పాటుగా నడిచిన నమ్మకమైన కొంతమంది(ఇంక్లూడింగ్ నాగబాబు)లాంటి వారికి పవన్ న్యాయం చెయ్యడానీకి రెడీనే. కానీ అది ప్రజలని మించి కాదు అనే వాదన వినిపిస్తుంది. పొత్తులో భాగంగా కొంతమందిని బాధపెడుతూ సీట్లు కేటాయించలేకపోయిన పవన్ పై ఎంతమంది తిరగబడినా పవన్ ని ఓడించలేకపోయారు.
ఇక రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు సంపాదించడానికి కాదు, ప్రజల కన్నీటి బొట్టు తుడవడానికి అని పవన్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు గెలిచాక కూడా అదే మాదిరి పవన్ ఉండాలని, ఉంటారని ఆశిస్తూ అందరిలా పవన్ ని జమకట్టకండి అంటూ పవన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు చేస్తున్నారు.