Advertisement
Google Ads BL

ఆడియన్స్ లో ఊపు తీసుకొచ్చేనా ?


నిస్తేజంగా ఉన్న బాక్సాఫీసుని విశ్వక్ సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ కదిలిస్తారనుకున్నారు ఆడియన్స్. కానీ మూడు సినిమాలు మిక్స్డ్ టాక్ తో వెళ్లిపోయాయి. ఇక ఎలక్షన్ ముగిసింది. ఫలితాలు వచ్చేసాయి. ప్రజలు, ప్రేక్షకులు రిలాక్స్ అవుతున్న సమయంలో ఎంటర్టైన్మెంట్ చేస్తామంటూ శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఈ రెండు చిత్రాలే కాదు పాయల్ రక్షణ, నమో, నవదీప్ లవ్ మౌళి లాంటి చిత్రాలు కూడా బాక్సాఫీసు దగ్గర సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ చిత్రాలు ఏమైనా ప్రేక్షకుల్లో ఊపు తీసుకొస్తాయా.. నిస్సత్తువుగా ఉన్న బాక్సాఫీసు దగ్గర టికెట్స్ తెగేలా చేస్తాయా అనేది మరికొద్దిసేపట్లో తేలిపోతుంది. 

శర్వానంద్-శ్రీరామ్ ఆదిత్య మనమే చిత్రం ప్రేక్షకులకి ఫ్యామిలి ఆడియన్స్ కి దగ్గరయ్యేలా కనిపిస్తుంటే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో కాజల్ హడావిడి చెయ్యాలని డిసైడ్ అయ్యింది. కాజల్ తన పర్సనల్ సినిమాలా ఈ సత్యభామని ప్రమోట్ చేస్తూ వచ్చింది. మరి ఆ చిన్న చిత్రాలు ఎలా ఉన్నా ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ లో ఎంతవరకు కదలికని తీసుకొస్తాయో అని అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. 

Will it bring momentum in the audience?:

Manamey, Satyabhama and others release tomorrow 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs