గత ఐదేళ్ళలో అహంకారం, అధికార మదం నెత్తికెక్కి నోటి కొచ్చినట్లుగా టీడీపీ వాళ్ళని కాదు కాదు చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నోరేసుకుని పడిపోవడం మాత్రమేనా.. నీచమైన మాటలతో బాధపెట్టిన మాజీ మంత్రి, మాజీ ఎమ్యెల్యే రోజా ఇప్పుడు తనని దూషిస్తున్న వారిని చూసి తెగ బాధపడిపోతోంది. ఆడదాన్ని అని కూడా చూడకుండా అనరాని మాటలంటున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చాక గుడులు గోపురాలంటూ తెగ తిరిగేసిన రోజా..వైసీపీలోకి చేరాక చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై, లోకేష్ ని పప్పు పప్పు అంటూ చేసిన నీచమైన కామెంట్స్ కి ప్రజలు బాగా బుద్ది చెప్పారు. అసలు ఎమ్యెల్యే హోదా లేకుండా చేసేసారు. దానితో రోజా పై రివర్స్ ఎటాక్ మొదలైంది.
డిక్కీ బలసిన కోడి.. చికెన్ షాప్ ముందు తొడకొట్టింది, పవన్ కళ్యాణ్ కి గాడిద కొచ్చినట్టుగా 50 ఏళ్ళు వచ్చాయని, లోకేష్ ని పప్పు పప్పు అని, చంద్రబాబు కి వయసొచ్చింది కానీ ఇంకితం లేదు అని, నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళ ఏడుపు ఈరోజు నీకు తగిలింది, మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు అంటూ వెటకరంగా మాట్లాడడం, నోటిలో ఎమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ ని పెట్టుకున్నావా అంటూ అధికారంలో ఉన్నప్పుడు చాలా కామెంట్స్ చేసింది రోజా.
ఇప్పడు రోజా ని తిడుతుంటే. చూస్తున్నారా ఘంటా గారు, అయ్యన్నపాత్రుడు, లోకేష్ గారిని నేను అడుగుతున్నా.. మీ ఇంట్లో మీ భార్యలు ఉన్నారు. మీ తల్లులున్నారు, మీ ఇంట్లో పిల్లలున్నారు. వారిని ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా.. సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడం ఇవన్నీ ఏమిటండి, నన్ను నా కేరెక్టర్ ని హెరాస్ చేస్తూ నీచంగా మాట్లాడారు, మీరేం మాట్లాడినా మేము దులుపుకుని వెళ్ళిపోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా రాజకీయాల్లో ఉంటుందా..
నేను మహిళల హక్కుల కోసం పోరాడుతూ.. నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చెయ్యకుండా పోరాడుతున్నాను.. అంటూ దాదాపు ఏడ్చినంత పని చేసింది రోజా. అది చూసిన నెటిజెన్స్ నువ్వన్నప్పుడు ఈ న్యాయం, ధర్మం గుర్తుకు రాలేదా రోజమ్మా.. నీ దగ్గరికి వచ్చేసరికి అన్ని గుర్తొచ్చాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.