జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పుకుని రాజకీయంగా ఎదిగి టికెట్ రాని కారణంగా వైసీపీలోకి జంప్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ప్రజలకి ఏం చేస్తాడో, ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడో చెప్పకుండా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, ప్రస్తుతం ఉన్న అన్న లెజెనోవా గురించి తప్పు తప్పుగా మట్లాడుతూ హైలెట్ అవ్వాలని చూసాడు.
కట్ చేస్తే ఈ ఎన్నికల్లో వైసీపీ మట్టి గొట్టుకుపోయింది. కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది. అసలు వైసీపీ ఎక్కడా మాటల్లో లేకుండా ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఇక పోతిన మహేష్ సైలెంట్ అవుతాడనుకుంటే.. తాజాగా
కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురందరిశ్వరి గారికి శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
జనం కోసం జగన్
జగన్ కోసం జనం .
కచ్చితంగా జగన్ గారు నిలబడతారు మరల ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారు. కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ 88 అసెంబ్లీ స్థానాలని కోల్పోయింది. 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైఎస్ఆర్సిపి 100 సీట్లతో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసేవారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూటమి చేస్తున్న విషప్రచారంలో వాస్తవం లేదు. వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోవడానికి ప్రధానంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకపోవడం, నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం మాత్రమే. కూటమి ఏమన్నా శాశ్వతమా, అవసరాలను బట్టి ప్రాధాన్యతలను బట్టి కూటమిలు ఏర్పడతాయి 2014లో కలిసి పోటీ చేశారు 2019 లో విడిపోయారు 2024 లో కలిశారు 2029 లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి?
కూటమిపాలన పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందో అనే విషయం అతి తొందర్లోనే ప్రజలకు చాలా తొందరగా అర్థం అవుతుంది. ప్రతి కార్యకర్త పాలన ఉండదని మాట్లాడుతూనే గెలిచి 24 గంటలు కాకముందే ప్రతీకార దాడులు చేస్తున్నారు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో... అంటూ మీడియా ముందు తెగ మాట్లాడేస్తున్నాడు.
అది చూసిన జనసైనికులు అయ్యో మహెష్ ఏ మొహం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చావ్.. నువ్ పవన్ కళ్యాణ్ ని ఎన్నిమాటలన్నావో అప్పుడే మర్చిపోతామా.. ఆయన భార్యపై ఏం వాగావో గుర్తు లేదా.. ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతున్నావంటూ పోతిన మహేష్ ని ఆటాడుకుంటున్నారు.