అల్లు అర్జున్ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. కారణం పుష్ప షూటింగ్ ఇంకా రెండు నెలలు బ్యాలెన్స్ ఉండడమే. ఆగస్టు 15 పుష్ప ద రూల్ విడుదల అంటూ మేకర్స్ ప్రతి పోస్టర్, ప్రతి అప్ డేట్ లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇటు చూస్తే షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. ఫాహద్ ఫాసిల్ వలన నిన్నమొన్నటి వరకు షూటింగ్ లో ఇబ్బందులు.
ఫాహద్ ఫాసిల్ ఇప్పుడు పుష్ప 2 కి డేట్స్ కేటాయించడంతో సుకుమార్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటి నుంచి రెండు నెలల వరకు పుష్ప 2 షూటింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక ఫాహద్ ఫాసిల్ తో కలిసి కనిపించే నటుల డేట్స్ ని సుకుమార్ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట.
ఎటువంటి పరిస్తితుల్లో ఈ రెండు నెలలో మొత్తం షూటింగ్ పూర్తి కావాలని, అనుకున్న సమయానికే పుష్ప 2 ని విడుదల చెయ్యాలని మేకర్స్ గట్టిగా అనుకుంటున్నారట. ఇక రెండు నెలల వర్క్ అనే విషయం విన్నాక అల్లు అభిమానుల గుండెల్లో గుబులు మొదలైంది. అంతా మంచి జరిగి పుష్ప ఆగష్టు 15 కి రావాలని వారు బలంగా కోరుకుంటున్నారు.