నగరిలో రోజాపై విపరీతమైన నెగిటివిటి ఏర్పడింది. ఆమెకి ఈ ఎన్నికల్లో అసలు టికెట్ కూడా రాదనుకున్నారు. కానీ జగన్ రోజా కి నగరి టికెట్ ఇచ్చేసారు. ఇక ఫైర్ బ్రాండ్ అంటూ తనకి తానే చెప్పుకునే రోజా వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యాక ఆమెపై ప్రజల్లోనే కాదు.. సాక్షాత్తు రోజా సొంత పార్టీ నేతలు కూడా ఆమెపై పగ పెంచుకున్నారు.
తనని ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ కార్యకర్తలు పనిచేసారని రోజానే చెప్పుకుంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో నేను గెలుస్తాను, జగన్ అన్న కూడా గెలుస్తాడు అంటూ రోజా చాలా నమ్మకంతో కనిపించింది. కానీ కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే కౌంటింగ్ కేంద్రం నుంచి మొహం వేలాడేసుకుని రోజా వెనుదిరిగి ఇంటి ముఖం పట్టింది.
అయితే రోజా ఘోర పరాజయంతో ఏంతో దిగులుపడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమె దిగులని వైసీపీ కార్యకర్తలు మరింతగా పెంచేశారు. నగరిలో రోజా ఓటమి చెందటంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటున్నారు. రోజా ఓటమికి నగరి మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నేత kJ శాంతి సంతోషం వ్యక్తం చెయ్యడం ఆశ్చర్యం కలిగించక మానదు.
రోజా ఓటమికి సంతోషం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వీదుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నేతలు, అసలే ఓడిపోయి ఉన్న రోజాని సొంత పార్టీ కార్యకర్తలే ఇంకాస్త ఏడిపించడం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది కదూ.!