Advertisement
Google Ads BL

ఏపీ రాజకీయాల్లో పవన్ వారసుడు హైలెట్


ఏపీ రాజకీయాల్లో నిన్న మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రలో జగన్ vs కూటమి అన్నట్టుగా సాగిన 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమితో కలిసి కనీవినీ ఎరగని రీతిలో సీట్లు దక్కించుకున్నారు. టీడీపీ 135, జనసేన 21, బిజెపి 8 సీట్లు కైవసం చేసుకుని వైసీపీ ని అధః పాతాళానికి తొక్కేసింది. 11 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయింది. 

Advertisement
CJ Advs

ఇక ఇదంతా ఒక ఎత్తైతే.. తండ్రి ఎన్నికల ప్రచారంలో హడావిడి చెయ్యని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ నిన్న ఫలితాల రోజు చేసిన సందడి చూసి పవన్ అభిమానులు ఎంతగా ఎగ్జైట్ అయ్యారో చెప్పక్కర్లేదు. తండ్రి గెలిచాడని తెలియగానే పవన్ భార్య అన్న తో కలిసి బయటికి వచ్చి ప్రజలకి అభివాదం చేసాడు 

అంతేకాకుండా తండ్రి పవన్ కళ్యాణ్, బావ సాయి తేజ్ తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మంగళగిరి జనసేన ఆఫీస్ కి వచ్చాడు. అక్కడికి నారా చంద్రబాబు నాయుడు రాగా.. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కొడుకుని పరిచయం చేసి చంద్రబాబు కాళ్ళకి దణ్ణం పెట్టించ్చి ఆశీర్వాదం ఇప్పించిన ఫొటోస్, వీడియోస్ విపరీతంగా హైలెట్ అయ్యాయి. 

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తో చంద్రాబాబుకి పుష్ప గుచ్చం ఇప్పించాడు. మరి నిన్నటి ఫలితాల్లో కూటమి విజయకేతనం ఎగరెయ్యడమే ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో.. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తండ్రితో కలిసి చేసిన హడావిడి మీడియాలో అంతే హైలెట్ అయ్యింది. 

Pawan successor is a highlight in AP politics:

Akira Nandan new look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs