Advertisement
Google Ads BL

రేవంత్ ఇలాకా ఈటలదే!!


మల్కాజిగిరి ఈటలదే.. ?

Advertisement
CJ Advs

భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవబోతున్నారా..? రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన ఈటలను ఎంపీగా అదృష్టం వరించబోతోందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలుకుని తొలి రౌండ్‌లో సింగిల్ కాదు ట్రిబుల్ డిజిట్‌తో దూసుకెళ్తూ ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈటల 6,230 ఓట్లతో లీడ్‌లో ఉండగా.. మొత్తం ఓట్లు 8881 వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి 2,581 ఓట్ల దగ్గరే ఉండిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 1,418 ఓట్లకే పరిమితం అయ్యారు.

కంచుకోటలో కమలం పాగా..!

మల్కాజిగిరి కాంగ్రెస్ కంచుకోట.. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా..! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఘోరంగా ఓడిన రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ప్రజలే గెలిపించి పార్లమెంట్‌కు పంపించారు. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్.. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ్నుంచి ఎవర్ని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నెలకొంది. ఆఖరికి సునీతను బరిలోకి దింపింది కాంగ్రెస్. అయితే.. ఈటలను ఆదరించేలానే మల్కాజిగిరి ప్రజలు ఉన్నారు. రాజేందర్ గెలిస్తే మాత్రం రేవంత్ కంచుకోటను కొట్టి.. ఢిల్లీలో అడుగుపెట్టబోతున్నట్లు లెక్క. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో అంతంత మాత్రమే ఉన్న కమలం.. ఈటల గెలిస్తే వికసిస్తుందన్న మాట. తొలి రౌండ్‌లో సరే.. మరి చివరి వరకూ ఇదే ట్రెండ్ సాగుతుందా లేదా అన్నది చూడాలి.

తెలంగాణలో ఎవరు లీడ్!

ఖమ్మం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఆధిక్యం

తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి లీడ్

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌

మహబూబ్‌నగర్‌లో మొదటి రౌండ్‌లో బీజేపీ లీడ్‌

ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి లీడ్‌

Revanth vs Etela:

Elections Result 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs