Advertisement
Google Ads BL

ఎటు చూసినా టీడీపీనే.. సీన్ రివర్సేనా?


అవును.. అనుకున్నొక్కటి అయినొదక్కటి అనే సామెత గుర్తుంది కదా.. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలానే ఉంది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఉంటాయన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఫలితాల్లో ఆరంభంలోనే అట్టర్ ప్లాప్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వై నాట్ 175 సంగతి దేవుడెరుగు.. గెలిస్తే చాలనుకున్న వైసీపీకి.. అసలు కౌంటింగ్ ప్రారంభమైంది మొదలుకుని పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్లు.. ఎక్కడా అడ్రస్ కనిపించట్లేదు. ముఖ్యంగా.. మంత్రుల వెనుకంజలో ఉండటం, అందులోనూ కచ్చితంగా గెలుస్తామన్న నియోజకవర్గాలే అవన్నీ కావడం గమనార్హం. ఇక ఫైర్‌ బ్రాండ్లుగా పేరుగాంచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వెనుకంజలో ఉండటం వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో వార్ వన్ సైడ్ అయ్యిందని.. కూటమిది ఓటమి కాదని గెలుపేనని క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది.  

Advertisement
CJ Advs

లెక్కలివిగో..

టీడీపీ : 45 స్థానాల్లో లీడ్

జనసేన : 08 స్థానాల్లో లీడ్

వైసీపీ : 07 స్థానాల్లో లీడ్

బీజేపీ : ఒకే ఒక్క స్థానంలో లీడింగ్

ఏపీ అసెంబ్లీ: 45 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యం

ఎవరెక్కడ.. ముందంజ?

కుప్పంలో చంద్రబాబు ముందంజ

పులివెందులలో వైఎస్ జగన్ ముందంజ

నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ముందంజ

రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజ

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌కు 4,300 ఓట్ల ఆధిక్యత

మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావుకు లీడ్‌

కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం

కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం

జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 3,550 ఓట్ల ఆధిక్యం

రాజమండ్రి రూరల్‌ 3వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి 4,905 ఓట్ల ఆధిక్యం

హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యం.. మొదటి రౌండ్‌లో 1,880 ఓట్ల ఆధిక్యం

గుడివాడలో టీడీపీ ముందంజ

కడప అసెంబ్లలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యం

మొదటి రౌండ్‌లో 660 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ

ఎంపీ స్థానాల్లో ఇలా..!

కడప ఎంపీ స్థానంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 2,274 ఓట్ల ఆధిక్యం

తిరుపతి లోక్‌సభ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి లీడ్‌

విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి, హిందూపురం, అనకాపల్లి..

గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం

మొత్తానికి చూస్తే.. ఎటు చూసినా సైకిల్ బెల్ ఓ రేంజ్‌లోనే మోగుతోంది కానీ.. ఫ్యాన్ ప్రభావం ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా.. వైసీపీ.. టీడీపీతో కాదు.. వైసీపీతో పోటీ పడుతోందని అర్థమవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..? మారుతుందా అనేది చూడాలి.

Either way, TDP is in the lead:

Election Result 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs