Advertisement

లీడ్‌లో టీడీపీ.. గెలిచే తొలి సీటు ఇదేనా!


టీడీపీ గెలిచే తొలి సీటు ఇదేనా..!

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఈ కౌంటింగ్‌లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన ఎన్నికల అధికారులు.. ఈవీఎంలు మొదలుపెట్టారు. అయితే ఆరంభం నుంచే టీడీపీ పలు అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో తొలి ఫలితం టీడీపీదే కావొచ్చు.. సైకిల్‌ బోణీ కొట్టొచ్చని అర్థమవుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారాన్ని బట్టి చూస్తే.. టీడీపీ చాలా నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. వాస్తవానికి ఇవన్నీ వైసీపీ ఊహించని రీతిలో ఉన్నవే. ఎందుకంటే.. ఏ నియోజకవర్గాలను అయితే వైసీపీ సీరియస్‌గా తీసుకుని ఓడించాలని చూసిందో.. అక్కడే టీడీపీలో ఉండటం గమనార్హం.

ఎక్కడ.. ఎవరు.. ఏ పార్టీ లీడ్‌లో ఉంది..!

నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ముందంజ

రాజమండ్రి రూరల్‌లో 910 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజ

గోరంట్లకు మొత్తం రాగా 5795.. వైసీపీ అభ్యర్థి మంత్రి వేణుకు 4885 ఓట్లు

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 1,549 ఓట్లతో లీడ్

మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు లీడ్‌‌లో ఉండగా.. వైసీపీ తరఫున పోటీచేసిన తోట త్రిమూర్తులు వెనుకంజ

పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్‌లో ఎక్కువగా చెల్లని ఓట్లు

నంద్యాల లోక్‌సభ టీడీ అభ్యర్థి బైరెడ్డి శబరి 113 ఓట్లతో ముందుంజ

చంద్రబాబు నివాసానికి చేరుకున్న వంగవీటి రాధ

రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి లీడ్

నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృస్ణదేవరాయలు లీడ్

మైలవరంలో తొలి రౌండ్  స్వల్ప ఆధిక్యతలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్

ప్రస్తుతం 2870 ఓట్ల ముందంజలో బుచ్చయ్య చౌదరి

చూశారుగా..  పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో అత్యధిక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. టీడీపీ గెలిచే తొలి అసెంబ్లీ స్థానం రాజమండ్రి రూరల్ అని తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకుంటే కుప్పం నియోజకవర్గమే. అటు బుచ్చయ్య చౌదరినా.. లేకుంటే చంద్రబాబు నాయుడా అన్నది ఇంకో రెండు గంటల్లో తేలిపోనుంది. ఎందుకంటే తొలి నుంచే ఆధిక్యం రావడం.. ఇదే కంటిన్యూ అయితే మాత్రం గెలుపు పక్కా అని తెలుస్తోంది. వాస్తవానికి కుప్పం కంచుకోటను బద్దలు కొట్టాలని.. కూసాలు కదిలించి వైసీపీ జెండా పాతాలని ఎంతగానో వైసీపీ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అదంతా ఎన్నికలకు ముందేనని.. పోలింగ్, ఫలితాల రోజు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని.. చంద్రబాబు ముందు నిలబడలేకపోయిందని అర్థం చేసుకోవచ్చు.

TDP in the lead.. Is this the first seat to win!:

Election Result 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement