Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ సినిమాలు మానెయ్యాలంట


ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే టెన్షన్ తో ప్రజలు ఎదురు చూస్తుంటే.. వైసీపీ వాళ్ళు మేము మరోసారి ప్రభుత్వంలోకి రాబోతున్నాము, జగన్ మళ్లీ సీఎం అవ్వబోతున్నారని కాన్ఫిడెన్స్ చూపిస్తుంటే.. టీడీపీ వాళ్ళు మాత్రం ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడడం మానేసి జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగుతూ తరచూ ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ చేత తిట్లు తింటున్నారు.

Advertisement
CJ Advs

మొన్న బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ కి టీడీపీ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ మాట్లాడి ఎన్టీఆర్ ఫాన్స్ కి టార్గెట్ గా మారాడు. ఇప్పుడు పిఠాపురం వర్మ గారైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మానేసి వస్తే.. టీడీపీ పార్టీలో పదవి ఇప్పిస్తా అంటూ మాట్లాడుతున్నారు. సినిమాలు మానేసి పార్టీ కోసం పని చేస్తే.. ఎన్టీఆర్ కి నేను పార్టీలో పదవి ఇప్పిస్తాను, భయపడి ఇంట్లో కూర్చుంటే కుదరదంటూ మట్లాడడం ఎన్టీఆర్ ఫాన్స్ కి పిచ్చ కోపం తెప్పించింది.

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీలో ఎప్పటికి సముచిత స్థానం ఉంటుంది అంటూ వర్మ మాట్లాడడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.

ఆయన తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు, రాజకీయాలకి ఆయనకి సంబంధం లేదు.. అలాంటప్పుడు ఎన్టీఆర్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమెందుకు.. ఎన్టీఆర్ సినిమాలు మానేస్తే.. నువ్వు పార్టీలో పదవి ఇప్పించేదేమిటి..  నీకు అంత సీన్ లేదులే అంటూ వర్మని ఎన్టీఆర్ ఫాన్స్ ఏసుకుంటున్నారు. 

NTR movies should be stopped:

 Pithapuram Ex Mla Varma On Jr Ntr
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs