సినీ నటి హేమ అరెస్ట్ కి రంగం సిద్దమైంది అనే న్యూస్ మీడియా హైలెట్ అయ్యింది. బెంగుళూరు పోలీసులు హైదరాబాద్ కి వచ్చారు. వారు హేమని ఏ క్షణాన అయినా అరెస్ట్ చెయ్యొచ్చనే టాక్ వినిపిస్తోంది. బెంగుళూరు రేవు పార్టీ కేసులో సినీ నటి హేమ కి బెంగుళూరు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు.
కానీ హేమ మొదటిసారి తనకి వైరల్ ఫీవర్ అని చెప్పి తాను విచారణకు రాలేనని చెప్పడం, రెండోసారి నోటీసులు అందుకుని విచారణకు రాకుండా ఎగ్గొట్టడంతో బెంగుళూరు పోలీసులు హేమని అరెస్ట్ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా కాదు ఆల్రెడీ హేమ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే హేమని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్టుగా సమాచారం.
బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో చాలామంది అంటే 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలగా.. అందులో సినీ నటి హేమ కూడా ఉండడంతో అందరితో పాటుగా హేమ కి బెంగుళూరు పోలీసులు విచారణకి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.