శ్రీలీల పేరు సినిమాల్లో వినిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తరచూ హైలేట్ అవుతూనే ఉంది. రకరకాల అవుట్ ఫిట్స్ తో శ్రీలీల బ్యూటిఫుల్ గా యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా శ్రీలీల అమెరికాలో కనిపించింది. అక్కడ డల్లాస్ లో థమన్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో సందడి చేస్తూ అభిమానులని సర్ ప్రైజ్ చేసింది.
ఇక తాజాగా శ్రీలీల షేర్ చేసిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. రెడ్ ఫ్రాక్ లో మేఘాలని తాకుతూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. బీచ్ ఒడ్డున రకరాల ఫోజులతో ఫోటొస్ కి ఫోజులిచ్చింది. ఆ రెడ్ డ్రెస్ శ్రీలీల అందాలని మరింతగా హైలెట్ చేసింది.
ఇక శ్రీలీల ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూవీని రిజెక్ట్ చేసింది అనే టాక్ నడుస్తుంది. మరోపక్క కోలీవుడ్ హీరోలు శ్రీలీల వైపు చూస్తున్నారట. అది కూడా స్టార్ హీరోలు కావడంతో అమ్మడి టైం మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.