వైస్సార్సీపీ కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చిన ఆరా మస్తాన్ కూడా రోజా నగరిలో ఓడిపోతుంది అని చెప్పాడు, కానీ రోజా మాత్రం ఏ ఎగ్జిట్ పోల్ ని నమ్మేదే లేదు అంటూ చెప్పడం హాస్యాస్పదం. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ తప్ప వైసీపీకి అనుకూలంగా ఎవ్వరు సర్వే ఇవ్వలేదు. కేవలం వైసీపీ సానుభూతి పరుడైన ఆరా మస్తాన్ మాత్రమే వైసీపీకి ఓటేశాడు.
దానితో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ రోజా మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ ని నమ్మనంటుంది అంటే తన పార్టీ గెలుస్తుంది అని చెప్పిన ఆరా మస్తాన్ సర్వే ని కూడా రోజా నమ్మనట్టే కదా.. అంటే వైసీపీ ఓడిపోతుందా.. అది చెప్పట్లేదు. జగన్ మళ్లీ గెలుస్తాడు, మళ్లీ జగన్ సీఎం అవుతాడని అంటుంది.
పదే పదే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునే రోజమ్మ చివరిసారిగా అంటే అధికారంలో ఉండి మంత్రి హోదాలో లాస్ట్ టైం శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. రేపు అసలు సిసలైన ఫలితాలు. ఇలాంటి సమయంలో దేవుణ్ణి ఏం కోరుకోవడానికి వెళ్లిందో రోజమ్మ.. అసలే ఓటమి ఖాయమనే మాట ఎప్పటి నుంచో రోజా చుట్టూనే తిరుగుతుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు.