Advertisement

ఏపీ ఎగ్జిట్ పోల్స్.. ఎంత గందరగోళమో..!


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వచ్చాయి.. ఎగ్జాక్ట్ పోల్స్‌కు ఇంకొన్ని గంటల్లో రానున్నాయి. అసలు ఈ సర్వేలు ఎందుకు రిలీజ్ చేశారో..? ఎవరి కోసం రిలీజ్ చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అసలు ఈ సర్వేలను పార్టీలే చేయించుకున్నాయా..? లేకుంటే సొంతంగా చేశారా..? అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతుతున్నాయ్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ సర్వే సంస్థలు జూన్-01న సాయంత్రం 6:00 గంటల నుంచి ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక చూస్కోండి.. ఒక్కో టీవీ చానెల్ ఒక్కో రకంగా.. ఒక్కో వెబ్‌సైట్ వెరైటీగా.. తెల్లారి లేచి చూస్తే పేపర్లలో ఎవరికి తోచిన, అనుకూలంగా ఉన్న సర్వేలే అచ్చు అయ్యాయ్. ఇదిగో ఫలానా సర్వే వైసీపీ గెలుస్తుందని ఇచ్చిదంటే.. ఇక టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేలు ఎన్ని..? ఒకవేళ టీడీపీ కూటమి గెలుస్తుందని సర్వే వస్తే.. ఎన్ని సంస్థలు చెప్పాయ్..? ఏ పార్టీ పరిస్థితి ఏంటి..? అని బూతద్ధాలు పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి.

Advertisement

దేవుడా.. ఇదేంటి..!

ఇక పేపర్లు, టీవీ చానెళ్లు కాసేపు అటుంచితే బాబోయ్.. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు దేవుడా.. రచ్చ రంబోలా!. వైసీపీ శ్రేణులు వారికి ఇష్టమొచ్చిన అదేనబ్బా.. అనుకూలంగా వచ్చిన సర్వేలు పోస్టు  చేసుకుంటే.. టీడీపీ వాళ్లు అంతకుమించి వైసీపీ ఓడిపోతుందని ఇన్ని సర్వేలు చెప్పాయ్ చూసుకోండని రౌండప్‌లు చేసి మరీ రచ్చ చేశాయి. ఇలా అటు టీడీపీ.. ఇటు వైసీపీ మధ్యలో జనసేన కార్యకర్తలు తెగ కొట్టుకున్నారు (ట్విట్టర్ వేదికగా). ఇక ఎదురెదురుగా ఉండి ఉంటే ఏ రేంజిలో కొట్టుకునే వారన్నది లైవ్‌లో చూస్తేనే అర్థమవుతుందేమో..! ఈ ఎగ్జిట్ పోల్స్.. మౌత్ టాక్‌తో అసలు మనం ఎవరికి ఓటేశాం.. ఈ సర్వేలు, జనాలు ఏం చెప్పుకుంటున్నారు..? అని సదరు ఓటరు ఆలోచనలో పడిన పరిస్థితి. ఇంత కన్ఫ్యూజన్ ఏంటి మహాప్రభో అంటూ పోటీచేసిన అభ్యర్థి లబోదిబోమంటున్న సందర్భాలున్నాయ్. దీంతో పోటీచేసిన అభ్యర్థుల కన్నా.. ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు.. అంతకుమించి ప్రజలు ఎంతో కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

ఎగ్జాక్ట్ కాదుగా..!

పోలింగ్ మాత్రమే జరిగింది.. ఫలితాలు రాలేదు అంతే. మధ్యలో ఎవరెన్ని చెప్పినా ప్రజలు ఎవరికి ఓటేశారు..? ఎవరు గెలవబోతున్నారు..? అన్నది ఓటేసిన జనాలకు బాగా తెలుసు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజ్ అక్కర్లేదు.. కంగారు పడాల్సిన అవసరం అంతకుమించి వద్దు. ఇలా ఎగ్జిట్ పోల్స్ చూసి హడావుడి చేయాల్సిన.. పండుగ చేసుకోవడం, స్వీట్లు పంచుకోవడం.. ఇదిగో మేం గెలిచామని ప్రత్యర్థుల మీదికి దాడులకు తెగబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకే ఒక్కరోజు అంతే.. సోమవారం ఆగితే మంగళవారం పొద్దు పొద్దున్నే ఇక కౌంటింగ్ షురూ అవుతుంది.. అప్పుడిక ఫలితాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. మరీ ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్లూ మీరు అనుకున్నది జరగొచ్చు.. జరగకపోవచ్చు కూడా. డబ్బులు పోతాయేమో అని టెన్షన్ తీసుకుని లేనిపోని రోగాల బారిన పడాల్సిన అవసరం లేదు.. ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు.. ఒక్కరోజు ఆగితే ఎగ్జాక్ట్ ఫలితాలొస్తాయ్.. అప్పుడిక చూస్కోండి.. అయిపాయ్ అంతే!!

AP exit polls.. what a mess..!:

Expectations vs Exit polls
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement