Advertisement
Google Ads BL

యాక్సిస్ మై ఇండియా సర్వేను నమ్మొచ్చా!!


యాక్సిస్ మై ఇండియా.. ఒకటా రెండా ఇప్పటి వరకూ చేసిన సర్వేలన్ని అట్టర్ ఫ్లాప్.. ఇప్పుడు మళ్ళీ సర్వే చేసింది ఇది కూడా తుస్ అవ్వడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడీ సర్వే పైనే తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఈ సర్వే పైనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 2 నుంచి 4 పార్లమెంట్ స్థానాలు మించి రావని చెప్పడమే ఇందుకు కారణం. అంటే ఈ లెక్కన పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలిచే పరిస్థితి లేదని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐతే పేరుకే జాతీయ సంస్థ, అందులోనూ ఇండియా టుడేతో కలిసి సర్వే చేయడంతో సదరు మీడియా సంస్థ క్రెడిబిలిటీని కూడా సందేహించాల్సిన పరిస్థితి. 

Advertisement
CJ Advs

అదెలా సాధ్యం..! 

రాయలసీమలో అదీ ఉమ్మడి కడప జిల్లాలోనే రెండు ఎంపీ స్థానాలు పక్కాగా వైసీపీకి వస్తాయి. అలాంటిది మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి..? అనంతపురం, కర్నూల్, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ పరిస్థితి.. మరీ ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంత బలంగా ఉంది..? దీనికి తోడు గుంటూరు, విజయవాడలో ఎన్నికల చివరి క్షణాల్లో సమీకరణలు ఎలా మారిపోయాయో చెప్పక్కర్లేదు. ఇక కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో అంతకు మించి బలంగానే ఉంది.. పైగా గత ఎన్నికల్లో ఈ జిల్లాలే వైసీపీని గెలిపించి.. జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాయి. అలాంటిది యాక్సిస్ మై ఇండియా సర్వేతో నివ్వెరపోతున్న పరిస్థితి. మరోవైపు.. అసలు ఈ సర్వే సంస్థ ఓకే ఒక్క జిల్లాలో మాత్రమే సర్వే చేసిందా..? ఏంటి అనే సందేహాలు వస్తున్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇండియా టుడే హెడ్ రాజ్ దీప్ ఏపీలో గ్రౌండ్ లెవల్ లో తిరిగిన వ్యక్తి కావడంతో ఆయనకు అన్నీ తెలుసు. ఇదే విషయాన్ని.. సర్వే ఫలితాలు చెబుతుండగానే.. సదరు సంస్థ అధినేతను ఇది తప్పు అని నిలదీసిన పరిస్థితి. దీంతోనే యాక్సిస్ మై ఇండియా సర్వేను ఎంతవరకూ నమ్మవచ్చనేది అర్థం చేసుకోవచ్చు.

ఇదిగో ఫ్లాప్ లిస్ట్!!

వాస్తవానికి యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలు ఒక్కటంటే ఒక్కటీ గెలిచిన సందర్భాలు లేనే లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే.. గత అనుభవాలు ఒకసారి చూస్తే.. 2023 లో ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా బీజేపీ గెలవడం, 2023 లోనే రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా.. బీజేపీ గెలిచి నిలిచింది. అంటే.. ఈ సంస్థ ఏది చెప్పినా రివర్స్ అవుతోంది అన్న మాట. ఇంకాస్త లోతుల్లోకి వెళ్లి..  2021 లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని చెప్పగా తృణముల్ కాంగ్రెస్ గెలిచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడంతో సదరు సర్వే సంస్థ ముక్కున వేలేసుకుంది. చూశారుగా ఇదీ యాక్సిస్ సంస్థ సర్వే కహాని.. మొక్కుబడిగా చేసిన ఈ సర్వే ఏపీలో ఎంత మాత్రం వర్కవుట్ అవుతుందో.. లేకుంటే ఇక్కడ కూడా అట్టర్ ప్లాప్ అయ్యి.. మరోసారి అభాసుపాలు అవుతుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Can you believe the Axis My India survey!!:

Axis My India survey!!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs