మెగా ఫ్యామిలోకి వరుణ్ తేజ్ భార్యగా నాగబాబు కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి అత్తగారింట్లో చక్కగా కలిసిపోయింది. అత్తగారు పద్మ తో కలిసి ఆవకాయ్ పెట్టడం, ఫెస్టివల్ కి పూజలు చెయ్యడం దగ్గర నుంచి మరదలు నిహారిక తో కలిసి ఎంజాయ్ చెయ్యడం అన్నిటిలో లావణ్య త్రిపాఠి హైలెట్ అవుతూనే ఉంది.
ఈమధ్యన భర్త వరుణ్ తేజ్ తో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్ళిన లావణ్య త్రిపాఠి అక్కడ ఎంజాయ్ చేస్తున్న ప్రదేశలతో పాటుగా తన కొత్త పిక్స్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. లండన్ ట్రిప్ లో మోడ్రెన్ డ్రెస్సులతో క్లాసీ లుక్స్ లో లావణ్య త్రిపాఠి చాలా చక్కగా కనిపిస్తుంది.
తాజాగా వదిలిన గ్రీన్ టాప్ ఫొటోస్ అయితే లావణ్య అందాలని మరింతగా ఎక్స్ పోజ్ చేస్తున్నాయి. ఎలాంటి గ్లామర్ షో చెయ్యకుండా లావణ్య త్రిపాఠి తన బ్యూటిఫుల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. మరి మీరూ లావణ్య కొత్త ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి.