బేబీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ హీరోయిన్ వైష్ణవి చైతన్యలకు తదుపరి సినిమాలు బిగ్ షాక్ నే ఇచ్చాయి. విడుదలైన వైష్ణవి చైతన్య-ఆశిష్ ల లవ్ మీ అసలు వార్తల్లో లేకుండా పోయింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. బేబీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ ని నమోదు చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
దానితో ఆమె నటించే ప్రతి సినిమాపై ప్రేక్షకుల అటెన్షన్ కనిపించింది కానీ ప్రేక్షకుల అంచనాలను వైష్ణవి లవ్ మీ నిలబెట్టుకోలేకపోయింది. ఇక ఆనంద్ దేవరకొండ గం గం గణేష్ కూడా ఆడియన్స్ ని నిరాశపరిచింది. నిన్న శుక్రవారం విడుదలైన గం గేమ్ గణేశా చిత్రం మంచి అంచనాల నడుమ విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.
ఆనంద్ దేవరకొండ పెరఫార్మెన్స్, కొన్ని సీన్స్ మాత్రమే మెప్పించగా.. కథ, కథనం, హీరోయిన్స్ మెప్పించలేకపోవడం ఇవన్నీ సినిమాకి ఎఫెక్ట్ ఆయాయ్యి. అందులోను కాస్త క్రేజ్ ఉన్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయు వేగం కూడా గం గం గణేష్ తో పోటీ పడడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయ్యింది.
బేబీ తో బిగ్గెట్స్ సక్సెస్ అందుకున్న హీరో ఆనంద్-హీరోయిన్ వైష్ణవి వీరిద్దరూ తమ తదుపరి చిత్రాలతో డిజప్పాయింట్ చేసారు అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు నెటిజెన్స్.