Advertisement

వైసీపీ.. ఎంత విచిత్రమో కదా..!!


విధి ఎంత విచిత్ర‌మో క‌దా..! ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది.! నిన్న మొన్నటి వరకూ వై నాట్ 175 అంటూ తెగ హడావుడి వైసీపీ అండ్ కో బ్యాచ్ ఇప్పుడు గెలిస్తే చాలు మహాప్రభో అనుకుంటోంది. ఇన్నిరోజులు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని.. గట్టి ధీమానే వ్యక్తం చేసింది వైసీపీ. సీన్ కట్ చేస్తే ఇప్పుడు గెలుస్తామా..? లేదా..? అనే పరిస్థితి నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా అన్నది అటుంచితే వైసీపీలో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా టెన్షన్ నెలకొంది.

Advertisement

ఇదీ అసలు సంగతి..!

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఫలితాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. 175కు 175 స్థానాలు గెలుస్తున్నామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పిన పరిస్థితి. స్వయంగా జగన్ ఇలా చెప్పడంతో ఇక మంత్రులు, వైసీపీ నేతలు.. కార్యకర్తలు, వీరాభిమానులు ఊరికే ఉంటారా..? అంతకు మించి హడావుడి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఐతే బాబోయ్ ఆ ఎలివేషన్లు అస్సలు చూడలేం..!. కొందరు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నా లోలోపల మాత్రం ఫలితాలు ఎలా ఉంటాయో అన్న భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇక వైజాగ్ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా షురూ చేస్తుండటం విశేషం. ఎన్నికల ఫలితాలు.. మరీ ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం వస్తుండటంతో నరాలు తెగిపోయే రీతిలో ఉత్కంఠ నెలకొంది..

ఎక్కడినుంచి.. ఎక్కడికో..!!

మొదట 175 అసెంబ్లీ స్థానాలకు 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు 100 వస్తే చాలు బాబోయ్ అని కొందరు చెప్పుకుంటూ ఉంటే.. ఇంకొందరు ఏమో గెలిస్తే చాలు మహాప్రభో అని చెబుతున్న పరిస్థితి. ఇంకొందరు నేతలు ఐతే.. 110 నుంచి 125 వరకూ రావొచ్చని.. ఇంకొందరు వైసీపీ నేతలు మాత్రం 120 నుంచి 150 వరకూ వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు ఐతే ఈసారి వైసీపీ అనుకున్నన్ని సీట్లు రావడం అతి కష్టమే అని.. పార్టీ గెలుస్తుంది కానీ అనుకున్నన్నీ సీట్లు మాత్రం రావు అని చెబుతున్నారు. చూశారుగా.. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూశారు కదా.. ఐనా 175 కు 175 రావాలంటే ఎంత కష్టమైన పని అన్నది వైఎస్ జగన్ రెడ్డికి కూడా తెలుసు.. అందుకే టార్గెట్ అది పెట్టుకుంటే ఇంచుమించు రావొచ్చని ఇలా అని ఉండొచ్చు. ఇక చివరిగా.. ఇవాళ రానున్న ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలవబోతున్నారు..? రేపొద్దున్న అసలు సిసలు ఫలితాలు అదెనబ్బా జూన్ నాలుగో తేదీన ఏ పార్టీ గెలుస్తుంది అన్నది తేలిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..!

YCP.. How strange..!!:

Tension Over AP Election Results
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement