లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం హాలిడేస్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తుంది. భర్త పిల్లలతో కలిసి నయనతార హాంగ్ కాంగ్ కి వెకేషన్ టూరు వేసింది. అక్కడ నయన్ తన ఫ్యామిలీతో ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఆమె షేర్ చేస్తున్న పిక్స్ చూస్తే తెలుస్తోంది. కవల కొడుకులతో నయనతార టైమ్ స్పెండ్ చేస్తుంది. హాంగ్ కాంగ్ టూరుకి భర్త విఘ్నేష్ శివన్ పిల్లలతో కలిసి వెళ్ళింది. పిల్లలతో భర్త తో ఆడుకుంటూ అల్లరి చేస్తుంది.
విగ్నేష్ శివన్ కూడా భార్య నయన్ తో పిల్లలతో అల్లరి చెయ్యడమే కాదు, నయన్ తో రొమాంటిక్ ఫోజులిస్తూ రచ్చ చేస్తున్నాడు. నయనతార సరదాగా భర్త తో ఎంజాయ్ చేసున్న పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు నయన్ ఫ్యామిలీ హాంగ్ కాంగ్ కి టూర్ వేసింది.
ప్రస్తుతం తమిళనాట బిజీగా కనబడుతున్న నయనతార కి హిందీ ఆఫర్స్ వస్తున్నాయి. అటు భర్త విగ్నేష్ శివన లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ తో LIC సినిమా చేస్తున్నాడు.