రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మెగా అభిమానుల ఓపిక నశించిపోతుంది. ఇండియన్ 2 మాదిరి గేమ్ చేంజర్ డేట్ కూడా ఒక్క నెల గ్యాప్ లోనే ప్రకటిస్తారెమో శంకర్ అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అక్టోబర్ అంటూ దిల్ రాజు, రామ్ చరణ్ చెప్పడమే కాని.. ఆ డేట్ లాక్ చేస్తే బావుంటుంది అని అడుగుతున్నారు అభిమానులు .
అదలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో RC 16 మొదలు పెట్టారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి మొదలు కానీ ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం బుచ్చి బాబు చేసిన ఓ ప్లాన్ వైరల్ గా మారింది.
RC 16 కోసం బుచ్చి బాబు ఓ మెగా విలేజ్ సెట్ వేయించబోతున్నాడట. రంగస్థలం కోసం సుకుమార్ వేయించిన పల్లెటూరి సెట్ కి మించి బుచ్చిబాబు చరణ్ కోసం భారీ సెట్ వేయిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 60 శాతం ఈ సెట్ లోనే ప్లాన్ చేశారట. దీని కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
మరి RC 16 విషయంలో బుచ్చి బాబు ఆలోచనలన్నీ పాన్ ఇండియా లేవల్లోనే కాష్ట్లీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెట్ ముచ్చట కూడా ఆ కాస్ట్లీ ఆలోచనలో భాగంగానే అని తెలుస్తోంది. ఏది ఏమైనా చరణ్ తో బుచ్చిబాబు ఓ భారీ మూవీని తెర పైకి తీసుకురాబోతున్నాడు.