వరస సినిమాలతో దూసుకుపోయి.. వాటి రిజల్ట్ తో ఢీలా పడిన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు ఆఫర్స్ కోసం వల వేస్తుంది. గుంటూరు కారం తర్వాత శ్రీలీల మళ్ళీ సినిమా సెట్స్ లోకి వెళ్ళలేదు. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా చేజారిపోయింది అనే టాక్ నడుస్తోంది. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు.
ఇక రవితేజ తో శ్రీలీల మరోసారి జోడి కడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నా అది ఇంకా ఫైనల్ అవ్వలేదు అనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా మారింది. తరచూ అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో మత్తెకించే ఫోటోలని సోషల్ మీడియాలో వదులుతుంది.
యూత్ కి గాలం వేసే ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా శ్రీలీల వదిలిన బ్యూటిఫుల్ పిక్స్ చూస్తే మాత్రం వావ్ అనకుండా ఉండలేరు. మెరూన్ కలర్ అవుట్ ఫిట్ లో శ్రీలీల నిజంగా అదరగొట్టేసింది. మరి ఇంత అందం చూపిస్తుంది.. ఆ అందం అవకాశాలు తెచ్చి పెడతాయా పాపా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.